Chiranjeevi : కేరళ బాధితులకు అండగా చిరు.. సీఎంకు స్వయంగా చెక్ అందజేత!
మెగాస్టార్ చిరంజీవి కేరళ బాధితులకు కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు తాజాగా కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ను కలిసి కోటి రూపాయల చెక్ ను అందజేశారు.