ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మెయిన్‌పురి జిల్లాలో కర్హాల్ నియోజకవర్గానికి బుధవారం పోలింగ్ జరుగుతుండగా.. అదే ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతి హత్యకు గురైంది. ఆమెను సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రశాంత్ యాదవ్ హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీకి ఓటు వేయాలని ఆ యువతి పలువురు ఓటర్లకు చెప్పిందని.. అందుకే ఆమెను హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో యువతి హత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Also read: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడుపై పండ్ల వ్యాపారి..
UP Dalit Woman Found In Sack
సమాజ్‌వాదీ పార్టీ నేతనే ఈ హత్యకు పాల్పడ్డారంటూ కర్హల్ అభ్యర్థి, బీజేపీ నేత అనుజేష్ ప్రతాప్ కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఆ బాలిక మృతదేహం నగ్నస్థితిలో లభ్యమయ్యిందని పలు మీడియా కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఆ యువతికి బెదింపులు కూడా వచ్చాయని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు ఆమెను వద్దన్నా బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారని.. ఆ తర్వాత యువతి మృతదేహం కర్హల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజ్రా నది వంతెన సమీపంలో లభ్యమైందని చెప్పారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
Also Read: సంపన్నులు ఓటేయరు.. ఎన్నికల వేళ హర్ష్ గోయెంక సంచలన పోస్ట్
మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' ఇటీవలే ఓ నేత ఈ ప్రాంతంలో తిరుగుతూ సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయాలని కోరాడు. కానీ మా కూతురు బీజేపీకి ఓటు వేస్తామని చెప్పింది. దీంతో ఆ నేత, తన సహచరులు కలిసి నా కూతురును బెదిరించారు. ఆ తర్వాతం ఈ దారుణం జరిగిందని'' ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఏకంగా టీచర్‌ను కత్తితో పొడిచి..
ఇదిలాఉండగా.. బుధవారం కర్హల్ అసెంబ్లీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలోనే దళిత యువతి హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి అనుజేష్ ప్రతాప్ యాదవ్ బరిలోకి దిగారు.
Also Read : ప్రేమలో పడ్డ ప్రభాస్ హీరోయిన్.. బాయ్ ఫ్రెండ్ కు స్పెషల్ విషెస్