Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడుపై పండ్ల వ్యాపారి.. హైదరాబాద్‌లో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ యువకుడు ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా.. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 20 Nov 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఓ కుటుంబం బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవనం సాగిస్తు్న్నారు. కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇదే ఏరియాలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఓ 5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వీరి ఇంటికి సమీపంలో ఓ యువకుడు పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్! బాలుడుని మచ్చిక చేసుకుని.. ఇతను ఆ బాలుడుతో స్నేహం చేయడం మొదలు పెట్టాడు. రోజూ పండ్లు ఇస్తూ బాలుడకి దగ్గర అయ్యాడు. చివరికి తల్లిదండ్రులు లేని సమయంలో చూసి బాలుడిని కత్తితో బెదిరించి బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ బాలుడిని కాపాడారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చూడండి: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..! ఇదిలా ఉండగా ఇటీవల విశాఖపట్నంలో మధురవాడలో ఓ కాలేజీలో యువతిపై కూడా నలుగురు కామంధులు అత్యాచారం చేశారు. న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఆ యువతి తోటి విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. వంశీ అనే విద్యార్థి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కంబాలకొండకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా ఆ తర్వాత మళ్లీ స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడంతో పాటు తన స్నేహితులు దారుణానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని మానసిక వేధనకు గురిచేశారు. ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేయగా.. తండ్రి అడగడంతో విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు! #hyderabad #rape-attempt #west-bengal #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి