సంపన్నులు ఓటేయరు.. ఎన్నికల వేళ హర్ష్‌ గోయెంక సంచలన పోస్ట్

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా చేసిన పోస్టు వైరల్‌ అవుతోంది. మలబార్‌ హిల్‌లో సంపన్నులు ఓటు వేయరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాధారణ ప్రజలతో కలిసి ఓటేసేందుకు భయపడుతుంటారన్నారు.

New Update
harsh

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా చేసిన పోస్టు వైరల్‌ అవుతోంది. మలబార్‌ హిల్‌లో సంపన్నులు ఓటు వేయరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''మలబార్ హిల్‌లో సంపన్నులు పోలింగ్‌ కేంద్రానికి మెర్సిడెస్‌ బెంజ్‌లో వెళ్లాలా ? లేదా బీఎండబ్ల్యూలో వెళ్లాలా అని చర్చికుంటూ కూర్చుకుంటారు.

Also Read: శృంగారం కోసం 300 కి.మీ ప్రయాణించిన పులి.. సహచరి ఎక్కడ దొరికిందంటే!

మనీష్‌ మల్హోత్రా అవుట్‌ఫిట్‌కు ఏ కళ్లజోడు పెట్టుకుంటే సెట్‌ అవుతుందోనని తెగ కష్టపడుతుంటారు. అప్పటివరకు ప్రజాస్వామ్యం వేచి ఉండాల్సిందే. పోలింగ్ బూత్ వద్ద వాలెట్‌ పార్కింగ్‌ ఉందా? లేదా? అని కూడా ఆలోచిస్తారు. వాళ్లకి మరే అంతకన్నా మరే ఆలోచనలు ఉండవు. క్యూలో నిలబడి సాధారణ ప్రజలతో కలిసి ఓటు వేయాల్సివస్తుందని సంపన్నులు భయపడుతుంటారని'' హర్ష్ గోయెంకా రాసుకొచ్చారు. 

Also Read: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఎన్ కౌంటర్.. 20 ఏళ్లకు చిక్కిన విక్రమ్ గౌడ!

ఇదిలా ఉండగా మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో పోలింగ్ సందడి నెలకొంది. మహారాష్ట్రలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతుండగా. ఝార్ఖండ్‌లో రెండో దశతో ఎన్నికలు పూర్తికానున్నాయి. ఇప్పటికే పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఓటేసి.. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఓటర్లకు సూచిస్తున్నారు.  

Also Read: మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి!

అయితే మహారాష్ట్రలో ముంబయి, నాగ్‌పూర్, పుణె వంటి నగరాల్లో అత్యధిక ఓటర్లు ఉన్నాకూడా అక్కడి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలల్లో కూడా 62-64 పట్టణ నియోజకవర్గాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. ఇక నవంబర్ 23న మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి ఇరు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు