/rtv/media/media_files/2026/01/17/civic-polls-2026-01-17-08-28-21.jpg)
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-షిండే సేన నేతృత్వంలోని మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది. ముంబై బీఎంసీలో 116 స్థానాల్లో ఆధిక్యం సంపాదించి 25 ఏళ్ల ఠాక్రేల పాలనకు తెరదించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలను గెలుచుకుని బీజేపీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. ముంబైలో లాస్ట్ 25 ఏళ్ళుగా ఉన్న ఠాక్రేల పట్టును బీజేపీ-షిండే సేన కూటమి బద్దలు కొట్టింది. బీఎంసీ పరిధిలోని మొత్తం 227 స్థానాలకు గానూ మహాయుతి కూటమి 116 స్థానాలను దక్కించుకుంది. ఇందులో బీజేపీ 88 సీట్లు సాధించగా, మహాయుతి 28 స్థానాలను కైవసం చేసుకుంది. మళ్ళీ అందులో ఉద్ధవ్ శివసేన 74 స్థానాల్లో, రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన 8 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 23 సీట్లను సాధించుకుంది. ఎఐఎంఐఎం ఎనిమిది, ఎన్‌సిపి మూడు, సమాజ్‌వాదీ పార్టీ రెండు, ఎన్‌సిపి (ఎస్‌పి) ఒక సీటు మాత్రమే గెలుచుకున్నాయి.
మహారాష్ట్రా అంతా ఆ కూటమిదే హవా..
మహాయుతి, బీజేపీ కూటమి హవా ఒక్క ముంబైకే పరిమితం కాలేదు. మహారాష్ట్రలోని మిగిలిన 28 మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఈ కూటమి ఘన విజయం సాధించింది. ఈ 29 మున్సిపల్ సంస్థలలోని 2,868 సీట్లకు 2,833 సీట్లకు ఫలితాలు ప్రకటించబడ్డాయి. అర్ధరాత్రి నాటికి మిగిలిన 35 సీట్లకు సంబంధించి SEC ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రాష్ట్రంలో బిజెపి 1,400 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షం శివసేన 397 సీట్లు గెలుచుకుంది, శివసేన (యుబిటి) 153, ఎంఎన్ఎస్ 13 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 324 సీట్లు గెలుచుకుంది. బిజెపి నేతృత్వంలోని కూటమి 118 సీట్లను గెలుచుకుంది, 227 మంది సభ్యులు కలిగిన బిఎంసిలో మెజారిటీ మార్కు 114 ను అధిగమించింది.
నగర మేయర్ గా బీజేపీ నేత..
మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు సాధించిన అఖండ విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ జనవరి 15న ఎన్నికలు జరిగిన ముంబైతో సహా 29 మునిసిపల్ కార్పొరేషన్లలో 25 కార్పొరేషన్లలో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ సారి ముంబై నగర మేయర్ గా బీజేపీ మేయర్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.
Also Read: Diabetes: ఇండియాలో పెరిగిపోతున్న చక్కెరవ్యాధి...ప్రపంచంలోనే రెండవ స్థానంలో..
Follow Us