Diabetes: ఇండియాలో పెరిగిపోతున్న చక్కెరవ్యాధి...ప్రపంచంలోనే రెండవ స్థానంలో..

మధుమేహంతో బాధపడుతున్న వారిలో భారత్ రెండవ స్థానంలో ఉందని ఓ అధ్యయనంలో తేలింది. 14.8 కోట్ల మందితో చైనా మొదటిస్థానంలో, 3.9 కోట్ల మందితో అమెరికా మూడోస్థానంలో ఉన్నాయని తెలిపింది. 

New Update
Diabetes

Diabetes

చక్కెర వ్యాధి..ఈ రోజుల్లో దీన్ని ఒక రోగం కింద కూడా భావించడం లేదు. అంతలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా భారత్ లో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. 2024లో భారత్‌లో 9 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో జీవించారని ఓ అధ్యయనం తేల్చింది. దీంతో ప్రపంచంలో అత్యధికంగా చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారిలో భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పింది. 14.8 కోట్ల మందితో చైనా మొదటిస్థానంలో, 3.9 కోట్ల మందితో అమెరికా మూడోస్థానంలో ఉన్నాయని వివరించింది. ద లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ అనే పత్రికలో ఈ అధ్యయనం ప్రచరితమైంది.  ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు చైనా, భారత్, అమెరికా, పాకిస్తాన్ వరుసగా ఉంటాయి. అలాగే ఈ దేశాల్లోనే మధుమేహం కూడా ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది. ఈ విషయంలో 2050 నాటికి పాకిస్థాన్‌.. అమెరికాను దాటేయవచ్చని అంచనా అంటున్నారు. 215 దేశాలకు సంబంధించి 2005 నుంచి 2024 మధ్య జరిగిన 246 అధ్యయనాలను విశ్లేషించి, 2050 నాటి పరిస్థితిపై ఈ అధ్యయనంలో అంచనా వేశారు. 

11 శాతం మందికి చక్కెర వ్యాధి..

2024 లో ప్రపంచ వ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ళ మధ్యలో ఉన్నవారిలో 58.9 కోట్ల మంది చక్కెర వ్యాధి బారిన పడ్డారు. ఇది ప్రపంచ జనాభాలో 11 శాతం. 2024లో ప్రతీ 9 మంది ముసలివారిలో ఒకరు.. మధుమేహంతో జీవించారు. 2025 ఏడాదికి ఈ సంఖ్య మరింత పెరిగి ఉంటుందని..85.3 కోట్లకు చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు.  అలాగే ఈ మధుమేహం బారిన పడ్డ వారిలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నారు. వీరు ఎక్కువగా ఉన్న దేశాల్లోనే ఈ వ్యాధి అధికంగా ఉంది. 2024కు 80 శాతంగా ఉన్న ఈ వాటా..2025కు 95 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జనాభా పెరుగుదల, జనాభాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, పట్టణీకరణ వంటి వాటి కారణంగానే జనాల్లో మధుమేహం పెరుగుతోందని చెబుతున్నారు. 75 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కుల్లో 25 శాతం మందిలో ఈ సమస్య ఉంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఈ రోగం బారిన వారు అధికం. అలాగే గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే మధుమేహుల సంఖ్య ఎక్కువగా ఉంది. 

Also Read: New Labour Code: కొత్త లేబర్ కోడ్ ఎఫెక్ట్..ఐటీ దిగ్గజాలకు వేల కోట్ల లాస్

Advertisment
తాజా కథనాలు