మోదీ ఉగ్రవాదాన్ని తరిమికొడతారు.. సంబిత్ పాత్రా సంచలన వ్యాఖ్యలు

ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం ముఖ్యపాత్ర వహించిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ప్రశంసించారు. ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని తరిమికొడతారని అన్నారు. అయితే ఆర్మీ చెప్పాల్సిన విషయాలు బీజేపీ చెబుతుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

New Update
Sambit Patra

Sambit Patra

పహల్గాం ఉగ్రదాడిపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. ఉగ్రదాడి సమయంలో ప్రధాని మోదీ పర్యటనలో ఉండగా.. వెంటనే క్యాన్సిల్ చేసుకుని తిరిగి వచ్చారని సంబిత్ పాత్రా అన్నారు. ఈ ఉగ్రదాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హామీ ఇచ్చినట్లే చేశారని అన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం ముఖ్య పాత్ర పోషించిందన్నారు. ఉగ్రవాదులను మోదీ అంతం చేస్తారని సంబిత్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆర్మీ చెప్పాల్సిన విషయాలను బీజేపీ చెబుతుంటే.. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇది కూడా చూడండి:  AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

ఇది కూడా చూడండి:BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

పాకిస్తాన్‌పై ప్రతీకారంగా..

పాక్‌పై ప్రతీకారంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. ఈ జలాల నీటిపై పాకిస్తాన్‌లో దాదాపు 90 శాతం మంది ఆధారపడి ఉన్నారు. వ్యవసాయంలో దాదాపు 80 శాతం ఈ నది జలాల నీటిపైన డిపెండ్ అయి ఉన్నారు. పాక్‌కు వెళ్లకుండా ఈ నీటిని ఆపడం వల్ల ఆ దేశ జీడీపీ పడిపోతుందని సంబిత్ అన్నారు. జీలం, చీనాబ్ నదులు ఇప్పుడు పూర్తిగా భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వీటికి ఆనకట్టలు కడితే ఇక సింధూ నదీ జలాల నీరు పాక్‌లోకి చేరే అవకాశమే లేదన్నారు. 

ఇది కూడా చూడండి:Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు