/rtv/media/media_files/2025/01/31/vFFPNUZgdbIGDu9GuLue.jpg)
Sonia Gandhi and Draupadi Murmu
రాష్ట్రపతి బాగా అలసిపోయారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ప్రసంగం అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారని వ్యాఖ్యానించారు. సోనియా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయాయి. దీంతో బీజీపీ సోనియాగాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: కుంభమేళాలలో తెలంగాణ వాసులు మిస్సింగ్.. ఆ నలుగురు ఎక్కడ?
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వంటి నేతలు ఇలా మాట్లాడకూడదని బీజపీ ఎంపీ సుకంతా మజుందార్ మండిపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రపతిని ఉద్దేశించే అలా మాట్లాడకూడదంటూ హితువు పలికారు. ఆదివాసి కుటుంబం నుంచి వచ్చి ద్రౌపతి ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ జమిందారీ మైండ్‌సెట్ ఈ విషయాన్ని అంగీకరించడంలేదంటూ విమర్శించారు. అందుకే ముర్ము ప్రసంగాన్ని వాళ్లు వ్యతిరేకిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?
ఇదిలాఉండగా.. రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో కేంద్రం పాటిస్తున్న విధానాలు, సాధించిన విజయాల గురించి మాట్లాడారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే 3 రేట్లు వేగంగా పనిచేస్తోందన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా మారనుందని తెలిపారు. ప్రసంగం ప్రారంభించినప్పుడు రాష్ట్రపతి.. కుంభమేళా తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు.
Also Read: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!
Also Read: పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాకు పారిపోయాడు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు