బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అద్వానీ వయస్సు 97 ఏళ్లు. గత కొంత కాలం నుంచి అద్వానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇది కూడా చూడండి: BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల I pray for a good, healthy recovery for our tallest leader, Shri. LK Advani as he is admitted into Appollo Hospital, Delhi. pic.twitter.com/1MgqdLfdFy — K.Krishna Sagar Rao (@BJPKrishnasagar) December 14, 2024 ఇది కూడా చూడండి: ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..! న్యాయ విద్యనభ్యసించి.. ఇదిలా ఉండగా.. ఎల్‌కే అద్వానీ 1927లో నవంబర్ 8న ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీలోని ఒక సంపన్న వ్యాపారవేత్త కిషన్ చంద్ అద్వానీ, జియాని దేవి దంపతులకు జన్మించారు. హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో చదివిన తర్వాత ముంబాయి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత మిలిటెంట్ హిందూ గ్రూప్ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు. దేశ విభజన జరిగిన తర్వాత భారత దేశం వచ్చిన తర్వాత శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీలో చేరారు. ఆ తర్వాత రాజస్థాన్ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడికి సలహాదారునిగా నియమితులయ్యారు. ఇది కూడా చూడండి: Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే "బలగం" బ్యూటీ అందాలు.. ఢిల్లీలో మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో 1966లో కార్పోరేషన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1970లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాత మీసా చట్టం కింద 1975లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రెండు పార్టీలు కలవడంతో భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ వచ్చింది. ఇలా కేంద్ర హోం మంత్రిగా మూడు సార్లు, భారత ఉపప్రధానిగా కూడా ఎన్నికయ్యారు. ఇతని చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం భారత రత్న కూడా ప్రదానం చేసింది. ఇది కూడా చూడండి: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన