జమిలి ఎన్నికల బిల్లుకు సిద్ధం.. సభకు హాజరుకావాలని ఎంపీలకు బీజేపీ విప్ జారీ..

మంగళవారం జరగనున్న పార్లమెంటు సమావేశాలకు తమ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ విప్‌ జారీ చేసింది. లోక్‌సభలో కీలక అంశాలపై చర్చ జరగనుందని.. ఎవరూ కూడా మిస్‌ కావొద్దని సూచించింది. మంగళవారం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

New Update
BJP ONOE

మంగళవారం జరగనున్న పార్లమెంటు సమావేశాలకు తమ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ విప్‌ జారీ చేసింది. లోక్‌సభలో కీలక అంశాలపై చర్చ జరగనంని.. ఎవరూ కూడా మిస్‌ కావొద్దని సూచించింది. ఈ మేరకు బీజేపీ చీఫ్ విఫ్ డా. సంజయ్ జైస్వాల్‌ ఓ లేఖను విడుదల చేశారు. మంగళవారం లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకే బీజేపీ విప్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి

ఇప్పటికే పార్లమెంటులో కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 129వ రాజ్యంగ సవరణ బిల్లుతో సహా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దీన్ని ఉభయసభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.  

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ మంగళవారం ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయలు నెలకొన్న వేళ.. విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను కేంద్రమంత్రి కోరనున్నారు. ఆ తర్వాత దీనిపై ప్యానెల్ కమిటీ ఏర్పాటుకు సభ్యులను ప్రతిపాదించాలని స్పీకర్ పార్టీలను కోరనున్నారు. మంగళవారం సాయంత్రం నాటికి కమిటీ సభ్యులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఇకనుంచి భిక్షాటన చేసేవారికి డబ్బులిస్తే జైలుకే !

పార్లమెంట్‌లో పార్టీలకు ఉన్న సంఖ్యాబలం ఆధారంగానే వాళ్లకి కమిటీలో చోటు దక్కుతుంది. దీన్నిబట్టి చూస్తే బీజేపీ నుంచి ఒక ఎంపీ కమిటీ ఛైర్మన్‌గా ఉంటారు. ముందుగా ఈ ప్రతిపాదిత కమిటీకి 90 రోజుల పాటు సమయం కేటాయిస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి సమయాన్ని పొడిగించే ఛాన్స్ ఉంటుంది. ఇదిలాఉండగా.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 12న కేంద్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని పక్కనబెట్టి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులను ఆమోదించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు