దేశంలో బీజేపీ పార్టీనే రిచ్..పార్టీ ఖాతాలో రూ.7 వేల కోట్లు

భారతదేశంలో అన్నింటికంటే బీజేపీనే రిచ్చెస్ట్. ఈ పార్టీ ఖాతాలో రూ. 7.113.80 కోట్లు ఉన్నాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. మూడవ స్థానంలో టీఎంపీ ఉండగా..తెలంగాణలో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఆదాయంలో కాంగ్రెస్ అధిగమించింది.  

New Update
BJPPPd

భారతదేశంలో మూడేళ్ళుగా బీజేపీనే అధికారం గవర్నమెంట్ నడిపిస్తోంది. ప్రస్తుతం ఈ పార్టీనే దేశంలో అతి పెద్ద పార్టీ కూడా. దానికి తగ్గట్టే బీజీపీనే రిచ్చెస్ట్ పార్టీ అని కూడా తేలింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులను ఎలక్షన్ కమిషన్ కు రాజకీయ పార్టీలు అందజేశాయి. దీంటో పార్టీలు తమ అకౌంట్లలో ఉన్న డబ్బులతో పాటూ ఎక్కడెక్కడ, ఎలా వచ్చాయి అన్నది కూడా వివరంగా రాసి ఎన్నికల సంఘానికి సమర్పించాయి.  ఈ వివరాల ప్రకారం బీజేపీ అత్యంత ఎక్కువ డబ్బులన్న పార్టీగా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. దీని ఖాతాలో రూ. 7, 113.80 కోట్లు ఉన్నాయి. 2023–24లో తమ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ.1,685.69 కోట్లు, ఇతర డొనేషన్ల ద్వారా రూ.2,042.75 కోట్లు వచ్చినట్టు బీజేపీ లెక్కలు చూపించింది. ఏడాది మొత్తం రూ.1, 754 ఖర్చు చేశామని చెప్పింది. దాంతో పాటూ అడ్వర్టయిజ్​మెంట్లకు రూ.591 కోట్లు, హెలికాప్టర్లకు రూ.174 కోట్లు, మీటింగ్​లకు రూ.84.32 కోట్లు, ర్యాలీలు, ఆందోళనలు, కాల్ సెంటర్ కోసం రూ.75.14 కోట్లు ఖర్చు చేశామని..అభ్యర్థుల ఖర్చులకు రూ.191.06 కోట్లు ఇచ్చామని బీజేపీ లెక్కలు చూపించింది. 

రెండో స్థానంలో కాంగ్రెస్...

బీజేపీ తరువాత రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. ఈ పార్టీ ఖాతాలో రూ.875 కోట్లు ఉన్నాయి. ఏడాది మొత్తంలో విరాళాల ద్వారా వచ్చిన రూ.1129.67 కోట్లతో కలిపి మొత్తం రూ.1225.11 కోట్లు రాగా... 2024 మార్చి 31 నాటికి కాంగ్రెస్​కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.828.36 కోట్లు వచ్చాయని కాంగ్రెస్ ఈసీకి తెలిపింది. ఇక కాంగ్రెస్ గత ఏడాది ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.207.94 కోట్లు, ప్రింటెడ్ మెటీరియల్‌పై రూ.43.73 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో విమానాలు/హెలికాప్టర్ల కోసం రూ.62.65 కోట్లు ఖర్చు చేయగా..అభ్యర్థులకు రూ.238.55 కోట్లు ఇచ్చామని చెప్పింది.  మార్చి 31, 2024 నాటికి ప్రచార ఖర్చుల కోసం రూ.28.03 కోట్లు, సోషల్ మీడియా కోసం రూ.79.78 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపించింది కాంగ్రెస్. ఇక భారత్ జోడో యాత్రకు 49.63 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపింది. 

Also Read:  Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

ఇక మిగతా పార్టీల విషయానికి వస్తే.. తృణమూల్ కాంగ్రెస్ ఆదాయం 646.39 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఇది 333.46 కోట్లు ఉండగా...ఈ ఏడాది అది దాదాపు డబుల్ అయింది. తెలంగాణలో 2023-24 సంవత్సరంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను అధిగమించింది. కాంగ్రెస్ మొత్తం ఆదాయం రూ.685.5 కోట్లు. మరోవైపు ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ ఆదాయం మాత్రం ఈ ఏడాది క్షీణించింది. 2022-23లో ఆ పార్టీ వద్ద రూ. 85 కోట్లు ఉండగా.. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 22 కోట్లకు తగ్గింది.   

Also Read: Maha Kumb Mela: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు