అమెరికా అంటే భూతల స్వర్గమని, సకల సౌకర్యాలు, అవకాశాలకు కేంద్రమని చెప్పుకుంటారు. అంతేకాదు ఇండియాలో ఏడాదికి వచ్చే జీతం.. అక్కడ 2 నెలలకే సంపాధించవచ్చు. అందుకే అమెరికా వెళ్లాలని చాలామంది కలలు కంటారు. కానీ.. అక్కడి గన్ కల్చర్ గురించి వింటే.. మళ్లీ అమెరికా వెళ్లాలనే ఆలోచనే రాదు. అమెరికాలో గన్‌లు.. పెన్నుల్లా జేబులో పెట్టుకొని తిరుగుతారు. కొంచెం తేడా వస్తే తూటా దింపేస్తారు. యూఎస్ కొత్త సంవత్సవరం వేడుకలు కాల్పుల్లో దద్దరిల్లాయి. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు సంచలనం రేపుతున్నాయి. న్యూయార్క్‌లోని క్వీన్స్ కౌంటీకి చెందిన అమజురా నైట్ క్లబ్‌లో కాల్పుల బీభత్సం సృష్టించాయి. ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోయారు. మరోచోట.. న్యూ ఆర్లిన్స్‌లో ఓ వ్యక్తి జనాలపైకి కారు ఎక్కించి.. వాళ్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు ఓ ఉన్మాది. ఈ దాడిలో 15 మంది మృతి చెందారు. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్‌లో టెస్లా కారులో బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు. ఈ బ్లాస్‌లో ఓ వ్యక్తి మరణించగా.. ఏడుగురికి గాయాలైనాయి. మరో కొన్నిరోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేయబోతుండగా.. ఈ దాడులు కలవర పెడుతున్నాయి.
ఇది కూడా చదవండి: CMR College: మల్లారెడ్డి కాలేజీ సీజ్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
2023లో 22 మంది మృతి..
తన శత్రువుని ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడే అమెరికాకి ఇంటి దొంగని పట్టుకోవడానికి కష్టమౌతుంది. అగ్రరాజ్యంలో అంతర్గత శత్రువుల ముప్పు ఎక్కువైంది. గన్ కల్చర్, మాస్ ఫైరింగ్ అమెరికాకు కొత్తేం కాదు. 2014 బెల్జియంలో యూదుల మ్యూజియంపై, అలాగే 2016లో ఫ్రాన్స్‌లో బాస్టిల్ డే రోజున ట్రక్ తో ఇలాంటి దాడులే జరిగాయి. 2023 జనవరి మూడో వారంలో 2సార్లు జరిగిన కాల్పుల్లో 18 మంది చనిపోయారు. 2023 నవంబర్ లెవిస్టన్, మైనేలో జరిగిన సామూహిక కాల్పుల్లో 22 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. బతుకుదెరువు కోసం వచ్చిన నల్లజాతీయుల దారిదోపిడీలు నిత్యం అమెరికాలో కనిపిస్తుంటాయి. ఒంటరిగా వెళ్లేవారిని తుపాకీతో బెదిరించి డబ్బు, నగలు లాగేసుకుంటారు.
ఇది కూడా చదవండి: BJP Candidate List 2025: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?
డెవలప్‌మెంట్‌లో పెద్ద దేశమైనా గన్ కల్చన్ అనే విష సంసృతి నుంచి అమెరికా బయటపడలేకపోతుంది. దీనికి కారణం అక్కడి చట్టాలు, రిపబ్లికన్ పార్టీ విధానాలు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వాడొచ్చని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. ఇంకేముందు దుకాణాల్లో చాక్లెట్లు, బిస్కెట్లలా అక్కడ గన్స్ అమ్ముతారు. అమెరికా జనాభా ప్రస్తుతం 33 కోట్లు. కానీ అక్కడున్న ఆయుధాల సంఖ్య 39 కోట్లు. అంటే ప్రతి 100మంది దగ్గర 120 ఆయుధాలు ఉన్నాయి. ఇది అక్కడి ప్రజలను భయాంధోళనకు గురిచేస్తోంది. సామన్యప్రజలే కాదు.. అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ పైనే కాల్పులు జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు అమెరికా శాంతిభద్రతలు ఏస్థాయిలో ఉన్నాయో..? అక్కడున్న ఇండియన్స్, ఇతర దేశస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిందే.. ఓ సర్వే ప్రకారం ఈ గన్ కల్చర్ వల్ల గత 50 ఏళ్లలో అమెరికా 14 లక్షల మందికి పైగా పౌరులను కోల్పోయింది. అక్కడ ప్రతిరోజు 110మంది తుపాకీ సంస్కృతికి బలైపోతున్నారు.
అగ్రరాజ్యంలో దాడులు, కాల్పులు, దారిదోపిడీలకు కారణాలేంటో తెలుసా? అమెరికాలో తుపాకులను వాడుతున్నవారిలో రిపబ్లికన్లే ఎక్కువ మందట. అందుకే గన్ కంట్రోల్ చట్టాలకు సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ అడ్డుతగులుతుంటుంది. గన్ కల్చర్‌కు రిపబ్లికన్ పార్టీ బహిరంగంగానే మద్దతు తెలుపుతుంది. గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీయే. 2025 జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన నాలుగేళ్ల పాలనలో ఈ గన్ కల్చన్ ఇలాగే ఉంటుందని అమెరికన్స్ అంటున్నారు. 2020లో గన్ కల్చర్ కంట్రోల్ చేయాలని ఓ సర్వే నిర్వహిస్తే.. దానికి 52శాతం ప్రజలే మద్దతు ఇచ్చారు. ఎలాంటి మార్పు అవసరం లేదని 35శాతం మంది అభిప్రాయపడ్డారు. 11శాతం ప్రజలు ఇప్పుడున్న చట్టాలు ఇంకా సులభతరం చేయాలని కోరారు.
నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) అమెరికాలో గన్ కల్చర్ సపోర్ట్ చేసే సంస్థ. వాళ్ల బిజినెస్ కోసం అమెరికన్ పార్లమెంటు సభ్యులను డబ్బుతో కొని ఈ కల్చర్‌పై కఠినమైన చట్టాలు అమలుకాకుండా చూస్తోంది. జాతి అహంకారం కూడా అమెరికాలో శాంతిభద్రతలకు కారణం.. అమెరికాలో పుట్టి పెరిగిన వారిని తెల్లజాతీయులని, వలసవచ్చిన వారు నల్లజానీయులని చిన్నచూపు చూస్తారు.అమెరికన్ ఇంటలిజెన్స్ వ్యవస్థ లోకల్ విషయాలపై అంతగా ఫొకస్ చేయదు. అంతేకాకుండా అమెరికా ఎప్పుడూ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చుతూ.. వాళ్లకీ, వీళ్లకీ సహాయం చేస్తున్నట్లు పెత్తనం చెలాయిస్తోంది. అందువల్ల ఇంటర్నల్ క్రిమనల్స్‌ను పెద్దగా పట్టించుకోదు పోలీస్ వ్యవస్థ. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిటెక్టీవ్, క్రైమ్ సీనీ ఇన్వెస్టిగేషన్, లోకల్ పోలీస్, ఫెడరల్ ఏజెంట్స్ ఇలా దాదాపు 20 రకాల పోలీసులు అమెరికాలో ఉంటారు.
1968 - 2017 మధ్య అమెరికాలో బుల్లెట్ల కారణంగా సుమారు 15 లక్షలమంది మరణించారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.. 2020లోనే అమెరికాలో 45వేల మందికి పైగా తుపాకులకు బలైయ్యారు. ఇందులో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. 2016లో నిర్వహించిన ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే.. ఆయుధాలు కలిగి ఉండటమే ఆత్మహత్యలకు ముఖ్యమైన కారణమట. ఈ లెక్కలు అక్కడి అధికార యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తుపాకుల శబ్ధాలు వినపడుతూనే ఉంటాయి.