Telangana: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికపై బిగ్‌ అప్‌డేట్..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికపై కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ అంశాలపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఆగస్టు 23న గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.

New Update
Big update on Telangana Local Body Elections

Big update on Telangana Local Body Elections

తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. సెప్టెంబర్‌ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇంకా వివాదం నడుస్తోంది. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ అంశాలపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఆగస్టు 23న గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్.. పీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌కు ఆదేశించారు. 

Also Read: కాళేశ్వరంపై ప్రభుత్వం మరో కుట్ర.. మోటర్లను ఆన్, ఆఫ్ చేస్తున్నారు: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ఇదిలాఉండగా ఆదివారం సీఎం రేవంత్‌ను మహేష్ కుమార్‌ గౌడ్ కలిశారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. PAC సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి విషయాలపై చర్చలు జరిపారు. ముందుగా ఆగస్టు 16,17వ తేదీల్లో PAC మీటింగ్ నిర్వహించాలని భావించినా అది కుదరలేదు. అయితే సెప్టెంబర్ చివరినాటికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని.. కోర్టును తాము గడువు కోరతామని మహేష్‌ కుమార్‌ గౌడ్ సంకేతాలిచ్చారు. పీఏసీ మీటింగ్‌లో మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొత్తానికి ఆగస్టు 23న ఎన్నికలు సెప్టెంబర్‌లోగా జరుగుతాయా ? లేదా మళ్లీ వాయిదా పడుతాయనా ? అనేది తెలియనుంది. 

Also Read: సంచలన నిర్ణయం.. ఇక నుంచి వీధికుక్కలకు కూడా క్యూఆర్‌ కోడ్, GPS

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు నిధులు కూడా విడదల కావడం లేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోతాయని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పీఏసీ సమావేశం కోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్నిరోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ క్లారిటీ రానుంది. 

Also Read: ఈ ప్రదేశాలకు వెళ్తే.. రావడం కష్టమే.. భయంతో చనిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు!

ఇదిలాఉండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే దేశంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం రేవంత్‌తో సహా టీ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో దీనిపై నిరసనలు కూడా చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ కూడా రిజర్వేషన్లు కల్పించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు.

Advertisment
తాజా కథనాలు