/rtv/media/media_files/2025/12/02/app-2025-12-02-15-30-15.jpg)
అన్ని మొబైల్ ఫోన్ల(mobile-phones) లో సంచార్ సాథీ(Sanchar Saathi) మొబైల్ అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. సైబర్ మోసాల నుంచి పౌరులను రక్షించడానికి అంతేకాకుండా ఎవరైనా పోగొట్టుకున్న ఫోన్‌లను తిరిగి పొందడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం(central-government) చెబుతుంది. అయితే కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇది ప్రభుత్వ నిఘా వైపు వేసిన అడుగు అని ఆరోపిస్తూ, ఈ ఆదేశాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్ ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. "బిగ్ బ్రదర్ మమ్మల్ని చూడలేడు. గోప్యత హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పొందుపరిచిన ప్రాథమిక జీవించే హక్కులో అంతర్గత భాగం" అని ఆయన X వేదికగా పేర్కొన్నారు.దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
Also Read : గాల్లో రెండు విమానాలు ఢీకొనకుండా ఎలా ప్రయాణిస్తాయో తెలుసా ?
ఇంతకీ ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే..
సంచార్ సాథీ యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఐఎంఈఐ (IMEI) నంబర్.. సీఈఐఆర్ (CEIR)తో కనెక్ట్ అవుతుంది. ఐఎంఈఐ అనేది ప్రతి మొబైల్‌కు ప్రత్యేకంగా ఉండే 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ నంబర్. CEIR ఒక కేంద్రీకృత డేటాబేస్. చట్టబద్ధంగా తీసుకున్న ప్రతి మొబైల్ వివరాలు ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి. ఒకవేళ ఫోన్ పోయినా లేదంటే దొంగతనానికి గురైనా.. ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసేలా రిక్వెస్ట్ చేయవచ్చు. తర్వాత సంబంధిత మొబైల్ ఐఎంఈఐ ఎక్కడా పనిచేయకుండా అన్ని నెట్‌వర్క్‌లను సీఈఐఆర్ అలర్ట్ చేస్తుంది. దాంతో సిమ్ మార్చినా ఫోన్‌తో ఉపయోగం లేకుండాపోతుంది. కాగా.. IMEI నంబరును ట్యాంపరింగ్ చేస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా.. రెండు శిక్షలూ విధించేలా టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023ను రూపొందించారు.
సంచార్ సాథీ వెబ్‌సైట్ ప్రకారం, ఈ యాప్‌ను ఉపయోగించి ఇప్పటివరకు 42 లక్షల దొంగిలించబడిన ఫోన్‌లను నిరోధించారు.7 లక్షల ఫోన్‌లను తిరిగి పొందగలిగారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్‌ను కోటి మందికి పైగా, iOSలో దాదాపు 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు వెబ్‌సైట్ తెలిపింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్‌ను విడుదల చేసింది.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. RTC బస్సులు ఢీకొని 11 మంది మృతి
Follow Us