/rtv/media/media_files/2025/10/27/ai-minister-is-pregnant-2025-10-27-11-54-41.jpg)
AI Minister is pregnant
AI Minister Diella: నేడు ప్రపంచమంతా టెక్నాలజీ చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు కృత్రిమ మేథ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ సందర్భంగా పలు వింత వింత ఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటిదే ఒక వింత వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదెంటంటే అల్బేనియా దేశానికి చెందిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రి 'డియెల్లా' గర్భం దాల్చిందని ఆ దేశ ప్రధాని ఎడి రేమా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు త్వరలోనే ఆమె 83 మంది 'ఏఐ పిల్లలకు' జన్మనివ్వనుందని తెలిపి మరింత ఆశ్చర్యపరిచారు.
Also Read : ప్యారిస్ మ్యూజియం చోరీ.. నెపోలియన్ ఆభరణాలు దొంగలించిన ఇద్దరు అరెస్ట్
World’s 1st AI minister now 'PREGNANT'
— RT (@RT_com) October 26, 2025
Albania’s PM Rama says Diella’s having 83 kids
Each will serve country’s MPs as assistants, and even 'suggest MPs how to react' pic.twitter.com/AIbksklPpf
ఎడి రేమా జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ విచిత్రమైన ప్రకటన చేశారు. "ఈరోజు మేము డియెల్లాతో ఓ పెద్ద సాహసమే చేశాం. తొలిసారిగా డియెల్లా గర్భవతి అయింది. అదీ 83 మంది పిల్లలను జన్మనివ్వనుంది" అని ఆయన ప్రకటించారు. ఈ 83 మంది 'ఏఐ పిల్లలు' పార్లమెంటులోని సోషలిస్ట్ పార్టీకి చెందిన 83 మంది ఎంపీలకు డిజిటల్ సహాయకులుగా పనిచేస్తారని కూడా ఆయన వివరించడం గమనార్హం. పార్లమెంటు కార్యకలాపాలను పూర్తిగా రికార్డ్ చేయడం, ఏదైనా కారణంతో సమావేశానికి హాజరుకాలేకపోయిన ఎంపీలకు సమాచారం అందించడం వీరి పని అని ఆయన వివరించారు. "ఉదాహరణకు, మీరు కాఫీ తాగడానికి వెళ్లి తిరిగి రావడం మరిచిపోతే, మీరు లేనప్పుడు సభలో ఏం జరిగిందో ఈ 'పిల్లలు' చెబుతాయి. ఎవరికి కౌంటర్ ఇవ్వాలో కూడా సూచిస్తాయి" అని రేమా సరదాగా వ్యాఖ్యానించారాయన.
ఇంతకీ ఎవరీ డియెల్లా?
అల్బేనియా భాషలో 'డియెల్లా' అంటే 'సూర్యుడు' అని అర్థం. ఈ ఏడాది జనవరిలో ప్రధాని ఎడి రేమా ఈమెను తొలి ఏఐ మంత్రిగా పరిచయం చేశారు. ఈ -అల్బేనియా ప్రభుత్వ పోర్టల్‌లో ప్రజలకు డిజిటల్ సేవలు అందించడంలో ఈ డిజిటల్ అసిస్టెంట్ సహాయం చేస్తోంది. సుమారు 95 శాతం పౌర సేవలను డిజిటల్‌గా యాక్సెస్ చేయడానికి వాయిస్ కమాండ్ల ద్వారా ఇది మార్గనిర్దేశం చేస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించే డియెల్లాను 'ప్రజా సేవల సేవకురాలు'గా ప్రధాని ఎడి రేమా అభివర్ణించారు. ప్రభుత్వ టెండర్లలో 100 శాతం అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా డియెల్లాను తీసుకొచ్చినట్లు ప్రధాని గతంలో తెలిపారు. పాలనలో టెక్నాలజీని ఒక సాధనంగా మాత్రమే కాకుండా, క్రియాశీలక భాగస్వామిగా పరిచయం చేయడం ద్వారా అల్బేనియా ప్రభుత్వం ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిందని అక్కడి మీడియా ప్రశంసించడం విశేషం.
Also Read: తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి
Follow Us