SBI: కస్టమర్‌తో ప్రాంతీయ భాష మాట్లాడని బ్రాంచ్ మేనేజర్.. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన SBI: వీడియో వైరల్!

బెంగళూరులో SBI బ్రాంచ్ మేనేజర్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. కస్టమర్తో కన్నడ మాట్లాడలేనంటూ ఆమె వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా ఆమెకు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య సైతం మండిపడ్డారు.

New Update
sbi bnglr

Bengaluru SBI branch manager Kannada language controversy

SBI: బెంగళూరులో SBI బ్రాంచ్ మేనేజర్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. కస్టమర్తో కన్నడ మాట్లాడలేనంటూ ఆమె వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా ఆమెకు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ ఇచ్చింది. 

హిందీలోనే మాట్లాడతా..

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్య నగర ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లో మహిళ బ్రాంచ్ మేనేజర్ తనతో కన్నడలో మాట్లాడాలని కస్టమర్ కోరాడు. కానీ ఆమె కన్నడ మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ‘ఇది కర్ణాటక మేడం. కన్నడ మాట్లాడాల్సిందే' అని కస్టమర్ బలంగా చెప్పాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఆమె.. ‘ఇది ఇండియా.. నీ కోసం నేను కన్నడలో మాట్లాడను. హిందీలోనే మాట్లాడతా’ అని అరిచింది. ఈ వీడియోను అక్కడున్న వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. 

ఈ వీడియోను భారత ఆర్థిక శాఖ మంత్రికి, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేని కన్నడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ వివాదం ఎస్బీఐ దృష్టికి వెళ్లడంతో ఆమెను బదిలీ చేస్తున్నట్లు ఆర్డర్స్ జారీ చేశారు. దీంతో వెంటనే దిగొచ్చిన ఉద్యోగిని.. కన్నడిగుల మనోభావాలు దెబ్బ తీసి ఉంటే క్షమించాలని కన్నడలో కోరింది. ఇకపై కస్టమర్లతో కన్నడలోనే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పడం గమనార్హం. 

ఇక ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. ఆమె తీరును ఖండించారు. పౌరులతో అంత నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని మండిపడ్డారు. స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులందరూ గౌరవించాలని, స్థానిక భాషలోనే మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ప్రాంతాల సంస్కృతి, భాషలో శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. భాషా వివాదం వేళ ఇలాంటి వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు దారితీచే అవకాశం ఉందన్నారు. 

telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు