/rtv/media/media_files/2024/11/12/gCdLB44pY5O9pfRJ8HTb.jpg)
TG RTC:
తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ ఓ రేంజ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. దీనికి తోడు పాత బస్సులు నడుపుతుండటంతో అవి ఎక్కడ పడితే అక్కడ మొరాయిస్తున్నాయి.
Also Read: BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు
బస్సుల నుంచి భారీ ఎత్తున వచ్చే పొగతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నుంచి సీట్ల దొరకవన్న టెన్షన్, పాత బస్సుల్లో ప్రయాణించే బాధలు తీరనున్నాయి. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారు.
Also Read: Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!
కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్‌ఆర్ పరిధిలో కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. సోమవారం నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు నియామక పత్రాలను అందించారు. ఆ తరువాత మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ నగరంలో ఇక నుంచి కాలుష్యం లేకుండా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. దీని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటుగా.. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయని చెప్పారు.
Also Read: Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు
నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం అన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను సైతం త్వరలోనే నగరంలో పరుగులు పెట్టించనున్నట్లు తెలిపారు. రవాణా శాఖలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి సేవలు అందించడంలో ప్రజలతో గౌరవప్రదంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.