Beef Biryani: అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో బీఫ్ బిర్యాని..!

యూపీలోని అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో సులేమాన్ హాస్టల్‌లో చికెన్‌ బిర్యానికి బదులు బీఫ్‌ బిర్యాని పెడతామని ఓ నోటీసు రావడం దుమారం రేపుతోంది. దీనిపై స్పందించిన వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అది టైపింగ్ ఎర్రర్ అని క్లారిటీ ఇచ్చింది. ఆ నోటీసును విత్‌డ్రా చేసుకున్నట్లు పేర్కొంది.

New Update
Beef Biryani’ in Aligarh Muslim University menu sparks row

Beef Biryani’ in Aligarh Muslim University menu sparks row

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో బీఫ్ బిర్యానీ వివాదం దుమారం రేపుతోంది. యూనివర్శిటీలోని సులేమాన్ హాస్టల్‌లో ఆదివారం లంచ్‌కి చికెన్‌ బిర్యానికి బదులు బీఫ్‌ బిర్యాని పెడతామని ఓ నోటీసు జారీ చేశారు. అయితే ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది వివాదానికి దారి తీసింది. చివరికీ దీనిపై వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. నోటీసులో టైపింగ్ ఎర్రర్‌ జరిగిందని క్లారిటీ ఇచ్చింది. దీనికి బాధ్యులైనవారిపై షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశామని తెలిపింది. 

Also Read: సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

 దానిపై అధికారిక సంతకాలు కూడా లేవని.. అందుకే వెంటనే ఆ నోటీసును ఉపసంహరించుకున్నామని వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. దీనికి బాధ్యులైన ఇద్దరు సీనియర్ విద్యార్థులకు షోకాజ్ నోటీసులు కూడా పంపించామని తెలిపింది. యూనివర్సిటీ నియమ నిబంధనలకు కట్టబడి ఉండేలా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని పేర్కొంది. 

Also Read: బీజేపీ విజయంపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్.. విధ్వంసాలు, కక్షలతోనే అంటూ!

మరోవైపు ఈ ఘటనపై బీజేపీ నేత నితీశ్ శర్మ కూడా స్పందించారు. యూనివర్సిటీ ఈ అంశంపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు చేశారు. ఇలాంటి వాటిని వర్సిటీ ప్రోత్సహిస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. '' ఈ ఘటనలో వర్సిటీ పాత్ర సిగ్గుచేటు. ఆ నోటీసు సర్ షా సులైమాన్‌ హాస్టల్‌లో సర్క్యులేట్ అయ్యింది. ఈ నోటీసును బహిరంగంగానే అంటించారు. దీనికి సీనియర్ ఫుడ్‌ కమిటీ సభ్యులు బాధ్యులు. ఇది చూస్తుంటే వర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌ తీవ్రవాద అంశాలను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. విద్యార్థుల తప్పిదం అంటూ మళ్లీ కవర్ చేస్తున్నారని'' నితిశ్ శర్మ విమర్శించారు.     

Also Read: వెస్ట్‌ బెంగాల్‌లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్.. ఉగ్రకుట్రనా ?

Also Read: మెక్సికోలో విషాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 41 మంది సజీవ దహనం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు