Mexico: మెక్సికోలో విషాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 41 మంది సజీవ దహనం

దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారు తెలిపారు.

New Update
Fire accident Mexico

Fire accident Mexico

Mexico: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు.  ప్రమాదంపై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ  దారుణం చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపించడంతో.. 38 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు బస్సు డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని,  ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు స్థానిక అధికారి వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు