సాధారణంగా చిన్న పిల్లలు బలపాలు తింటుంటారు. చిన్న చిన్న వస్తువులు కూడా మింగడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఓ 15 ఏళ్ల బాలుడు మాత్రం ఇంట్లో ఉన్న వాచీ బ్యాటరీలు, మేకులు ఇలా ఇంట్లో ఉన్న చిన్నపాటి వస్తువులను మింగేశాడు. అతడికి సర్జరీ చేసిన వైద్యులు వీటిని చూసి ఒక్కసారిగా షాకైపోయారు. ఈ ఘటన ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ పట్టణంలోని రత్నగర్భ కాలనీలో సంచిత్ కుటుంబం నివసిస్తోంది. అతనికి 9వ తరగతి చదువుతున్న ఆదిత్య శర్మ అనే 15 ఏళ్ల కొడుకు ఉన్నాడు. గత కొద్దిరోజులుగా అతడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు.
Also Read: కాలుష్య కొరల్లో తెలంగాణ.. ఆ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత
Batteries, Blades Among 56 Metal Objects Removed
దీంతో అతడి తల్లిదండ్రులు హాథ్రాస్‌లోని ఆస్పత్రిలో చూపించారు. ఆ తర్వాత జైపూర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొద్దిరోజులపాటు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఇంటికివచ్చాక మళ్లీ అనారోగ్యం పాలయ్యాడు. ఆ తర్వత అలీగఢ్‌లో శ్వాససంబంధిత సర్జరీ కూడా చేశారు. కానీ ఎలాంటి మార్పు రాలేదు. అక్టోబర్ 26న అలీగఢ్‌లో అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా ఆ బాలుడి కడుపులో 19 చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. నోయిడాలో చికిత్స చేయించుకోవాలని బాలుడి తల్లిదండ్రులకు సూచించారు. దీంతో బాలుడిని అక్కడికి తీసుకెళ్లగా వైద్యుల పరీక్షలో అతడి కడుపులో 56 వస్తువులు ఉన్నట్లు తేలింది.
Also Read: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. నెలాఖరు నుంచే రైతు భరోసా..
ఆ తర్వాత ఢిల్లీలోని సఫ్టర్‌జంగ్ ఆస్పత్రిలో అక్టోబర్ 27న ఆ బాలుడికి శస్త్రచికిత్స చేసి ఆ వస్తువులన్నింటినీ బయటకు తీసేశారు. వాచీ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులు ఇలా ఇంట్లో కనిపించే వస్తువులన్నీ బాలుడి కడుపులోనుంచి బయటపడ్డాయి. ఇన్ని వస్తువులు తెలిసో తెలియక మింగినా కూడా అతడి నోటికి గానీ, గొంతుకు గానీ ఎలాంటిగా గాయాలు కాలేవు. అయితే సర్జరీ జరిగిన ఒకరోజు తర్వాత బాలుడి గుండెవేగం విపరీతంగా కొట్టుకుంది. రక్తపోటు తగ్గింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయారు. బాలుడి తండ్రి మీడియాకు ఈ వివరాలు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : ఉగ్రవాదిని పట్టించిన కుక్క బిస్కెట్లు!
Also Read : మరికాసేపట్లో టెట్ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి!