కాలుష్య కొరల్లో తెలంగాణ.. ఆ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. 23 జిల్లా్ల్లో గాలి నాణ్యత సూచిక 100కు పైగానే ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హైదరాబాద్‌ కన్నా ఎక్కువగా అత్యధిక ఏక్యూఐ రికార్డవుతోంది.

New Update
air

తెలంగాణలో గాలి కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఈ పెరుగుదల నమోదవుతోందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్తలు గుర్తించారు. పలు ప్రాంతాల్లో గాలి కాలుష్య కారకాలైన పార్టిక్యులేట్ (PM) 2.5కు పైగా పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో గాలి నాణ్యత సూచిక 100కు పైగానే ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హైదరాబాద్‌ కన్నా ఎక్కువగా అత్యధిక ఏక్యూఐ రికార్డవుతోంది.  

Also Read: కులగణనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

వరంగల్‌లో అత్యధికంగా

వరంగల్‌లో ఎక్కువగా ఏక్యూఐ 143గా నమోదైంది. పీఎం 2.5 స్థాయిలో క్యూబిక్ మీటర్ గాలిలో మైక్రోగ్రాముల మేర ఉన్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు శాస్త్రవేత్తలు వెల్లడించారు. హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ ఏక్యూఐ 110 కన్నా ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది.

Also read: మంత్రికి పదవి గండం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఏక్యూఐ 128 రికార్డయ్యింది. నగరంలోని సనత్‌నగర్ 125, రాజేంద్రనగర్ మేడ్చల్ 120, జీడిమెట్ల 116, పటాన్ చెరు 114 మేర ఏక్యూఐ నమోదవుతోందని అధికారులు తెలిపారు. అయితే హైదారాబాద్‌లో తక్షణమే గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. లేకపోతే ఢిల్లీలో లాగా పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ గత కొన్ని రోజులుగా 300లకు పైగానే ఏక్యూఐ నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. 

Also read: త్వరలో కొత్త ఎనర్జీ పాలసీ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు