/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Currency-Notes-jpg.webp)
Bangladesh to Gujarat fake Indian currency notes Transport
Fake Notes: బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు రవాణా చేస్తున్న వేలాది ఇండియన్ కరెన్సీ నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రూ.6 లక్షల విలువైన 500 నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రూ.6 లక్షల నకిలీ నోట్లు..
ఈ మేరకు సూరత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితుల్లో ఒకరైన సురేష్ లాథిడియాపై ఇప్పటికే నకిలీ నోట్లకు సంబంధించిన మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేస్తోందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాంటెడ్ నిందితుడి నుంచి సురేష్ లాథిడియా రూ.6 లక్షల నకిలీ నోట్లను రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడని తెలిపారు. నిందితుడు ఈ నోట్లను బంగ్లాదేశ్ నుంచి కొనుగోలు చేశాడని సూరత్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
పూణే ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి విజయ్ చౌహాన్ (27), సురేష్ లాథిడియా (55) లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ క్యాటరింగ్ వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నారని, వారిద్దరి వద్ద రూ.9,000 విలువైన 18 నకిలీ రూ.500 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితులు కూరగాయలు, పాన్ దుకాణాలలో నకిలీ నోట్లను నిజమైన నోట్లతో మార్పిడి చేసేవారని వెల్లడించారు.
Also Read: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
ఇక పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా నివాసి తాహిర్ షేక్ నుండి రూ. 2 లక్షలకు రూ. 6 లక్షల విలువైన నకిలీ నోట్లను కొనుగోలు చేసినట్లు నిందితులు అంగికరించారు. ఈ కేసులో వాంటెడ్ నిందితుడు తాహిర్ షేక్ బంగ్లాదేశ్ నుంచి నకిలీ నోట్లను కొనుగోలు చేశాడు. నకిలీ నోట్లతో పాటు ఒక డిటెక్టర్ యంత్రం, కొన్ని మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.