Visa: వీదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.?. బంపర్‌ ఆఫర్‌.. రూ.1 కే వీసా

అట్లీస్ అనే సంస్థ తాజాగా ఈ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. రూ.1కే వీసా ఇస్తామని ప్రకటించింది. భారత ప్రయాణికలకు ఆగస్టు 4,5 తేదీల్లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది.

New Update
Atlys rolls out 1 rupee Visa for Indians travelling to over 15 countries

Atlys rolls out 1 rupee Visa for Indians travelling to over 15 countries

మీరు విదేశాలకు ట్రిప్‌ వేయాలనుకుంటున్నారా ?. వీసా కోసం వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రూ.1 చెల్లిస్తే చాలు మీకు వీసా వచ్చేస్తుంది. ఏంటీ షాక్ అవుతున్నారా ? నిజమేనండి. అట్లీస్ అనే సంస్థ తాజాగా ఈ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. రూ.1కే వీసా ఇస్తామని ప్రకటించింది. భారత ప్రయాణికలకు ఆగస్టు 4,5 తేదీల్లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వీసా ప్రాసెసింగ్‌ ప్లాట్‌ఫాం అయిన అట్లీస్ 2021లో ప్రారంభమయ్యింది. మోహక్ నహ్తా అనే వ్యక్తి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ కంపెనీని స్థాపించారు. అయితే ఈ కంపెనీ తాజాగా రూ.1కే వీసా ఆఫర్‌ను తీసుకొచ్చింది. 

Also Read: రష్యా నుంచి చమురు దిగుమతిపై కేంద్రం క్లారిటీ.. ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యలు

Atlys Rolls Out 1 Rupee Visa For Indians

'వన్‌ వే అవుట్' పేరిట యూకే, వియత్నాం,ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, హాంకాంగ్‌, ఖతర్‌, కెన్యా, తైవాన్‌, యూఏఈ, ఇండోనేసియా, జార్జియా, ఒమన్‌, మొరాకో లాంటి దేశాలకు వెళ్లాలనుకునేవారికి రూ.1 వీసా ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే అట్లీస్ సంస్థ ద్వారా వీసా బుక్ చేసుకుంటే ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, గ్రీస్‌ లాంటి దేశాలకు ఎలాంటి సేవాల రుసుము, అపాయిట్‌మెంట్‌ ఫీజు అనేవి ఉండవు. ఉదాహరణకు మీరు ఫ్రాన్స్‌కు వెళ్లాలనుకుంట్ దీని అపాయింట్‌మెంట్ ఫీజు ప్రస్తుతం రూ.2,047 ఉంది. సర్వీస్ ఫీజు రూ.2,905 ఉంది. అయితే ఈ ఆఫర్‌ కింద మీరు కేవలం రూపాయి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ అమెరికాకు వెళ్లాలని అనుకుంటే దాని సర్వీస్ ఫీజు రూ.19,940 ఉంటుంది. అయితే ఈ ఆఫర్ ఉన్నప్పుడు రూపాయి మాత్రమే చెల్లిస్తే చాలని అట్లీస్ ఫౌండర్ మోహక్ నహ్తా చెప్పారు యూకేకు సైతం ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు. 

అట్లీస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రాసెసింగ్‌ కేంద్రం వద్ద కాన్సులేట్, బయోమెట్రిక్ ఫీజులు చెల్లించాలి. ఆగస్టు 4న ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 5 రాత్రి 12 గంటల వరకు ఈ దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు కూడా ఉంటే వాళ్లకు సాధారణ ఛార్జీలు ఉంటాయి. ముందుగా మీరు ఏ దేశం వెళ్తున్నారో.. ఆయా దేశానికి సంబంధించి ఎంబసీ విధించిన రూల్స్‌ను గమనించుకోవాలి. లేకపోతే మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 

అయితే అంతర్జాతీయ ప్రయాణాలు అనేవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని నిరూపించడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నామని మోహక్ నహ్తా పేర్కొన్నారు. అంతేకాదు ఈ అట్లాస్‌ సంస్థ గతంలో కూడా ఓ ఫ్రీ వీసా ఆఫర్‌ ప్రకటించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా బంగారు పతకం గెలిస్తే కస్టమర్లకు ఫ్రీగా వీసా అందిస్తామని ఆఫర్ ఇచ్చింది . 

Also Read: అకౌంట్లోకి రూ.2000 జమ.. పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

rtv-news | national news in Telugu | international news in telugu | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు