H1B Visa: ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్

ప్రస్తుతం హెచ్ 1బీ వీసాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం వలసలపై ఉక్కుపాదం మోపుతూ.. గతేడాది హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచింది. ప్రస్తుతం ఏఐ రంగం అభివృద్ధి చెందడంతో విదేశీయులు, భారతీయులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

New Update
trump h1b visa

H1B Visa

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇమ్మిగ్రేషన్ విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విదేశీయులు అమెరికాలో పనిచేయడానికి అవసరమైన హెచ్-1బీ వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. దీంతో వీసా మీద అమెరికా వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ప్రస్తుతం హెచ్ 1బీ వీసాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం వలసలపై ఉక్కుపాదం మోపుతూ.. గతేడాది హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచింది. దీనికి తోడు వీసా స్టాంపింగ్, రెన్యువల్ ప్రక్రియలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం వంటివి కూడా ఇబ్బందికరంగా మారాయి.

ఇది కూడా చూడండి: Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏఐ రంగం అభివృద్ధి చెందడంతో..

విదేశీయుల నియామకాలను తగ్గించి, అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంది. అయితే ప్రస్తుతం కృత్రిమ మేధ రంగం భారీగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా పోటీ నెలకొంది. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు గతేడాది ఏఐపై సుమారు 380 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ భారీ లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన నైపుణ్యం ఉన్న నిపుణులు అమెరికాలో తక్కువగా ఉన్నారు. దీంతో లక్ష డాలర్ల వీసా ఫీజు భరించడానికి కూడా వెనుకాడకుండా కంపెనీలు విదేశీయులను తీసుకోవడానికి ముందడుగు వేస్తోంది.

 ఇది కూడా చూడండి: పశ్చిమ బెంగాల్‌ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

2025 ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీలు సమర్పించిన లేబర్‌ కండీషన్స్‌ అప్లికేషన్లలో 80 శాతానికి పైగా ఏఐ విభాగంలో నియామకాలకు సంబంధించినవే ఉన్నాయి.  అయితే అత్యధికంగా విదేశీ ఉద్యోగులను నియమించుకున్న సంస్థగా అమెజాన్ (4,644 మంది) నిలిచింది. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ కూడా ఎక్కువ మందిని నియమించుకుంది. అమెరికా యూనివర్సిటీల్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థుల్లో 80 శాతం మంది విదేశీయులే. అమెరికన్ విద్యార్థుల్లో ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీపై పట్టు లేకపోవడం టెక్ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. దీంతో విదేశీయులకు ముఖ్యంగా ఇండియన్స్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది.

ఇది కూడా చూడండి: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

అమెరికాలోని టెక్ కంపెనీలు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, డేటా సైంటిస్టులు, ఇన్ఫర్మేషన్ రిసెర్చ్ విభాగాల్లో విదేశీ నిపుణులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన భారతీయులు మొదట ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద పని చేస్తారు. ఆ తర్వాత వారు అమెరికాలోనే కొనసాగాలంటే హెచ్-1బీ వీసా ఒక్కటే మార్గం. కంపెనీలు తమ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈ ఖరీదైన వీసా ఖర్చులను భరిస్తున్నాయి. దీంతో భారతీయ టెక్ నిపుణులకు భారీగా అవకాశాలు పెరగనున్నాయి.

Advertisment
తాజా కథనాలు