బంగ్లాదేశ్‌కు ఇండియా మరో బిగ్‌ వార్నింగ్.. చికెన్ నెక్‌పై కౌంటర్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్‌ ఇటీవల చికెన్‌ నెక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనస్‌ వ్యాఖ్యలకు అస్సాం CM హింమంత శర్మ కౌంటర్‌ ఇచ్చారు. ఇండియాకు ఒక చికెన్‌ నెక్ మాత్రమే ఉంది. బంగ్లాదేశ్‌కు రెండు చికెన్‌ నెక్‌లు ఉన్నాయని ఆయన అన్నారు.

New Update
India chicken neck

భారత్‌పై విషం కక్కుతున్న బంగ్లాదేశ్‌కు మరోసారి వార్నింగ్ పడింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్‌ ఇటీవల చికెన్‌ నెక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనస్‌ వ్యాఖ్యలకు అస్సాం సీఎం హింమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇండియాకు ఒక చికెన్‌ నెక్ మాత్రమే ఉంది. బంగ్లాదేశ్‌కు రెండు చికెన్‌ నెక్‌లు ఉన్నాయని హింమత శర్మ సమాధానం ఇచ్చారు. నెక్‌ ఫర్ నెక్ అంటూ అస్సాం సీఎం వార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియా చికెన్‌ నెక్‌తో పోల్చితే బంగ్లా చికెన్‌ నెక్‌ చాలా చిన్నది. మేఘాలయతో చిట్టగాంగ్‌ పోర్టును కలిపే చికెన్‌ నెక్‌ కేవలం 29 కి.మీటర్లే అని ఆయన గుర్తు చేశారు.

Also read: BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం

అలాగే అటు బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. యూనస్, ఆర్మీ చీఫ్ వాకర్ మధ్య తీవ్ర విభేదాలు వస్తున్నాయి. యూనస్ నిర్ణయాలపై వాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద ఖైదీల విడుదలపై ఆర్మీ అసంతృప్తిగా ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే దిశగా యూనస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. యూనస్ తీరుపై సైనిక వర్గాల ఆందోళన చెలరేగుతుంది.

Also read: ఈడీకి సుప్రీం కోర్టు చురకలు.. ‘హద్దులు దాటుతోంది’

(bangladesh | yunus | muhammad yunus bangladesh | Muhammad Yunus controversy | chicken neck | india | Assam CM | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు