/rtv/media/media_files/2024/12/19/cashewnut9.jpeg)
cashew
జీడిపప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు , మెగ్నీషియం, జింక్, రాగి, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. రోజూ ఉదయాన్నే గుప్పెడు జీడిపప్పులను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీడిపప్పు ఆరోగ్యానికి మంచిదే. అలా అని ఎక్కువగా వీటిని తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి లిమిట్‌లోనే వీటిని తినాలి. అయితే ఉదయాన్నే జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!
గుండె ఆరోగ్యం
జీడిపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!
బరువు నియంత్రణ
ఇందులోని ఫైబర్, ప్రోటీన్ కడుపును నిండుగా ఉంచుతాయి. దీంతో ఫుడ్ తక్కువగా తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!
మధుమేహం
ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడతాయి.
చర్మ ఆరోగ్యం
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.