Kolkata: కోలకత్తా నిందితుడిని తీసుకురావడంలో పోలీసుల కొత్త టెక్నిక్..

కోలకత్తా రేప్‌ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను కోర్టుకు తీసుకురావడానికి కొత్త పద్ధతిని పాటిస్తున్నారు. కోర్టుకు వచ్చిన ప్రతీసారీ సంజయ్ ఏదో ఒకటి మాట్లాడ్డం, అది వైరల్ గా మారడంతో...ఇప్పుడు అతన్ని తీసుకువస్తున్నప్పుడు పోలీసులు హారన్ మోగించుకుంటూ వచ్చారు. 

New Update
roy

Kolkata Rape Case: 

కోలకత్తా రేప్, హత్య కేసు ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది. ఈ విషయమై నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు కోర్టులో హాజరుపరుస్తున్నారు. అయితే ఈరజు మాత్రం పోలీసులు అతడిని తీసుకువచ్చినప్పుడు కాస్త విచిత్రంగా ప్రవర్తించారు. ఎప్పుడూ లేని విధంగా తన జీపుల హారన్లను మోగించుకుంటూ వచ్చారు. సంజయ్ రాయ్‌ను అస్సలు మాట్లాడనివ్వకుండా కోర్టులోకి తీసుకెళ్ళిపోయారు. ఇది ముందు అందరికీ కాస్త విచిత్రంగా అనిపించింది. అయితే పోలీసులు ఇలా ఎందుకు చేశారంటే..

Also Read: JIO: కేవలం 610 రూ.లకే అన్ లిమిటెడ్ 5జీ డేటా

క్రితం సారి సంజయ్‌ రాయ్‌ను పోలీసులు కోర్టుకు తీసుకువచ్చినప్పుడు అతను సంచలన ఆరోపణలు చేశాడు. రేప్ కేసులో  తనను ఇరికించారని, తనకు వ్యతిరేకంగా కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్ వినీత్ గోయల్‌ కుట్ర పన్నారని సంజయ్ పోలీసు వ్యాన్ నుంచి గట్టిగట్టిగా కేకలు వేశాడు. తాను నిర్దోషినని కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో ఇదంతా అరిచి చెప్పాడు. అది కాస్తా సంచలనంగా మారింది. దాంతో ఈ సారి పోలీసులు ముందు జాగ్రత్త పడ్డారు.  సజయ్ మరో సారి అలా అరిచినా, మాట్లాడినా...ఎవ్వరికీ ఏమీ వినపడకూడదనే ఉద్దేశంతో హారన్లు మోగించుకుంటూ వచ్చారు, వెళ్ళారు. 

Also Read: Movies: నాగ చైతన్య–శోభిత పెళ్ళి శుభలేఖ వచ్చేసింది..చూశారా

ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. వైద్యులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారిస్తోంది.

Also Read: CAG: కాగ్ కొత్త ఛీఫ్‌గా కె. సంజయ్ మూర్తి

Advertisment
తాజా కథనాలు