Maharashtra: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ళ దాడి..

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ కారుపై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. దీంట్లో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. అనిల్ ముఖానికి గాయాలయ్యాయి. 

New Update
MH

EX Home Minister Anil Desmukh: 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై గుర్తు తెలియని వ్యక్తులు ఆడి చేశారు. ఆయన కారు మీద రాళ్ళను విసిరారు. నిన్న సాయంత్రం నాగ్‌పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై రాళ్లతో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. ప్రసతుతం మహారాష్ట్రలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. దాదాపు అందరు నేతలూ ప్రచారంలో ఉన్నారు. దేశ్‌ముఖ్ కూడా నార్ఖేడ్‌లో బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా దాడ జరిగింది. కటోల్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్‌కు ప్రచారం చేసేందుకు నార్ఖేడ్ వెళ్లారు. ప్రచారం ముగించుకుని తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. తలకు గాయం కావడంతో రక్తం కారింది. బట్టలు కూడా రక్తపుమరకలయ్యాయి.

Also Read: Movies: నాగ చైతన్య–శోభిత పెళ్ళి శుభలేఖ వచ్చేసింది..చూశారా

Also Read: CAG: కాగ్ కొత్త ఛీఫ్‌గా కె. సంజయ్ మూర్తి

మరోవైపు నిన్నటితో మహారాష్ట్రలో ప్రచార హోరు ముగిసింది. రేపు అంటే నవంబర్ 20న అక్కడ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రతో పాటూ జార్ఖండ్‌లో కూడా రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ ఇప్పటికే మొదటి విడత పోలింగ్ జరిగింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫస్ట్ ఫేజ్‌లో 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మిగతా స్థానాలకు బుధవారం జరగనుంది. ఇక మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి.  మహారాష్ట్రలో రధాని మోడీ దగ్గర నుంచీ కేంద్ర మంత్రులు అందరూ ప్రచారం చేశారు. అలాగే ఇండియా కూటమి నుంచి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమిలోని ముఖ్యనాయకులంతా ప్రచారం చేశారు. 

Also Read: Kolkata: కోలకత్తా నిందితుడిని తీసుకురావడంలో పోలీసుల కొత్త టెక్నిక్..

Also Read: JIO: కేవలం 610 రూ.లకే అన్ లిమిటెడ్ 5జీ డేటా

Advertisment
తాజా కథనాలు