/rtv/media/media_files/2025/08/05/uttarakhand-cloud-burst-2025-08-05-21-40-30.jpg)
Uttarakhand Cloud Burst:
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది.దీంతో నీరు, అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది. గ్రామమంతా బురదలో చిక్కుకుపోయింది. పర్వత సానువుల్లో ఉన్న ధరాలీ గ్రామంపై ఒక్కసారిగా ప్రవాహం విరుచుకుపడటంతో ఊరంతా కొట్టుకుపోయింది. హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఘటన తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. 150 మంది సైనికులను సంఘటనాస్థలానికి పంపినట్లు ఆర్మీ తన ‘ఎక్స్’లో పేర్కొంది. హర్షిల్‌లోని ఆర్మీ క్యాంప్‌నకు దాదాపు 4 కి.మీ దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆర్మీ వివరించింది.
ఇది కూడా చూడండి:Uttarakhand Cloud Burst: ఉత్తరాఖండ్ భారీ క్లౌడ్ బరస్ట్.. బురదకు కొట్టుకుపోయిన గ్రామం.. 50 మందికి పైగా?
సమాచారం తెలుసుకున్న 10 నిమిషాల వ్యవధిలోనే సైన్యం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు ఎక్స్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని.. ఇప్పటి వరకు 90 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఆర్మీ తెలిపింది. వారందర్నీ హర్షిల్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు స్థానిక పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గ్రామం పూర్తిగా బురద నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు తీవ్రంగా విఘాతం కలుగుతోంది. మీటర్ల మేర పేరుకుపోయిన బురదను తొలగించి.. బాధితులను బయటకు తీసుకురావడం కత్తిమీద సాములా మారింది. మరోవైపు ఆకస్మిక వరదలకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగానే ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచుకొచ్చినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ధరాలీ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఉత్తరకాశీలోని సుఖీ టోప్‌లోనూ మెరుపు వరదలు సంభవించాయి. దీంతో పలు ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లగా.. మరికొన్ని కొట్టుకుపోయాయి.
ఇది కూడా చూడండి:Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. కొండ చరియలు విరిగిపడి మొత్తం నాశనం.. భయానక దృశ్యాలు చూశారా?
కాగా ఈ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.100 మందికి పైగా గల్లంతైనట్లు అధికారుల వెల్లడించారు. ధరాలీలో హర్సిల్ ఆర్మీ క్యాంప్ కొట్టుకుపోయింది, శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఆర్మీ,NDRF,SDRF బృందాలు సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 90 మందిని ఇండియన్ ఆర్మీ కాపాడింది.
ఇది కూడా చూడండి:Heavy Rains: ముంచుకొచ్చిన భారీ వరదలు.. 252 మృతి చెందగా.. 3 వేల మందికి పైగా..!