Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. కొండ చరియలు విరిగిపడి మొత్తం నాశనం.. భయానక దృశ్యాలు చూశారా?

ఉత్తరాఖండ్‌లో గంగోత్రీలో క్లౌడ్‌ బరస్ట్‌ వల్ల ధరాలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టుకుని పోయింది. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి.

New Update
Cloud Burst

Uttarakhand Cloudburst

గత కొన్ని రోజుల నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతేడప లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా నదులు, సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీలోని ఖీర్ గంగా నది విజృంభించింది. దీంతో అక్కడ క్లౌడ్‌ బరస్ట్‌ జరిగింది. దీనివల్ల గంగోత్రీలోని ధరాలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టుకుని పోయింది. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 

Also Read: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!

శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు..

ఈ క్లౌడ్‌ బరస్ట్‌ వల్ల కొందరు గ్రామస్థులు ఆ కొండచరియల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి వారిని రక్షిస్తున్నాయి. ఒక్కసారిగా కొండపై నుంచి ఫోర్స్‌గా రావడంతో కొండ దిగువున ఉన్న ఇళ్లు, ప్రయాణాలు చేసే వారు అందులో చిక్కుకున్నారు. రోడ్డు అంతా బురదగా మారింది. ఇదంతా ఇళ్ల వరకు వెళ్లడంతో చాలా ఇళ్లు మునిగిపోయాయి. ఈ వరదల్లో దాదాపుగా 70 మందికిపైగా గల్లంతు అయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వెంటనే NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Also Read: మందుల ధరలు తగ్గాయి: పేద, మధ్యతరగతికి కేంద్రం ఊరట

సీజన్ మొదలైనప్పటి నుంచి భారీ వర్షాలు..

ఉత్తరాఖండ్‌లో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. ఈ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏకధాటిగా కురిసిన వర్షాలకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడిక్కడా చెట్లు, భవనాలు నేల మట్టం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాలకు కొండలు బాగా తడిగా మారి విరిగిపడుతున్నాయి. దీనివ్ల ఇళ్లు, షాపులు ఇలా ఎన్నో ఆ మట్టిలో కూరకుపోతున్నాయి. ఉత్తరాఖండ్‌లో రాంపూర్, నైనిటాల్, చకర్పూర్, లఖన్‌పూర్, పిస్టోర్, బర్హైని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు