Heavy Floods: వర్షాలు.. వరదలతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి
ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి పట్టణాలు వరద నీటిని తట్టుకోలేక అల్లాడుతున్నాయి. అటు అస్సాం వరదలకు అల్లకల్లోలంగా మారింది. ఇటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.