Uttarakhand Cloud Burst: ఉత్తరాఖండ్ భారీ క్లౌడ్ బరస్ట్.. బురదకు కొట్టుకుపోయిన గ్రామం.. 50 మందికి పైగా?
ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ వల్ల గంగోత్రీలోని ధరాలి గ్రామంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా బురద రావడంతో ధరావలి గ్రామం మొత్తం బురదకు కొట్టుకుని పోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 50 మందికిపైగా గల్లంతు అయినట్లు తెలుస్తోంది.