Komatireddy-Balakrishna: బాలయ్య వేస్ట్.. ఆ విషయంలో నేనే బెస్ట్.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

బాలకృష్ణ కంటే కూడా తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయన రోజుకు ఒకరికి కొడతారట అని అన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో పలు అంశాలపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

New Update

బాలకృష్ణ రోజుకొకరినీ కొడతారంట అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో కోమటిరెడ్డి పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సినిమాలు ఎవరు చూస్తారంటూ ప్రశ్నించారు. బాలకృష్ణ కంటే కూడా తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారన్నారు. అయినా ఆయన సినిమాలకు కలెక్షన్స్ వస్తాయట.. అంటూ కామెంట్ చేశారు.  బీఆర్ఎస్ వాళ్లు హౌలా గాళ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్పా ఏమి తెలియదన్నారు.
ఇది కూడా చదవండి: KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్

కేటీఆర్ తండ్రి చాటు కొడుకు..

కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అని.. హరీష్ రావు మామ చాటు అల్లుడు అంటూ కామెంట్ చేశారు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కాదని ఎద్దేవా చేశారు. వాళ్లతో మేము ఏం మాట్లాడతాం అంటూ సెటైర్లు వేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో డమ్మీ మంత్రిగా ఉన్నాడన్నారు. ఆయనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా గుర్తు పట్టడం లేదని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Betting Apps: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌‌‌తో లక్షల్లో అప్పులు.. కరీంనగర్ జిల్లా యువకుడు సూసైడ్!

ప్రశాంత్ రెడ్డి మెంటల్ పట్టినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఉప్పల్--నారపల్లి ఫ్లై ఓవర్ పనులను తాను గడ్గరీతో మాట్లాడి చేయిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు మాటలతో బతకడం అలవాటైందని ధ్వజమెత్తారు. త్వరలో ఉస్మానియా హాస్పిటల్ కు టెండర్లు పిలుస్తామన్నారు. 

(komatireddy-venkat-reddy | balakrishna | telugu-news | telugu breaking news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు