/rtv/media/media_files/2025/04/05/atosZPWCkbMHHjq5sPx3.jpg)
Amit Shah
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం పాండుం ముగింపు సభలో మాట్లాడారు. తాను దంతేశ్వరి మాత ఆశీస్సులు పొందానని.. వచ్చే ఏడాది నవరాత్రి నాటికి ఎర్ర భీభత్సం అంతం కావాలని అన్నారు. బస్తర్ గిరిజన సంస్కృతిని దేశానికి, ప్రపంచానికి చాటిచెప్పే పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
Also Read: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు
ఈ సందర్భంగా వేదికపై నుంచే మావోయిస్టులకు సవాల్ విసిరారు. ''బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరు. మీరు ఆయుధాలు వీడండి. జనజీవన స్రవంతిలో కలవండి. ప్రధాని మోదీ నుంచి నేనొక సందేశం తీసుకొచ్చా. వచ్చే ఏడాది దేశంలో ప్రతీ గిరిజన జిల్లా నుంచి కళాకారులను ఒకే పేరుతో బస్తర్ పాండుం ఉత్సవాలకు తీసుకొస్తామని'' అమిత్ షా అన్నారు. అలాగే బస్తర్ పాండుంకు అంతర్జాతీయ హోదా ఇవ్వాడానికి కేంద్ర ప్రభుత్వం ప్రపంచం నలుమూలల నుంచి బస్తర్‌కు రాయబారులను తీసుకొస్తుందని తెలిపారు.
#WATCH | Dantewada, Chhattisgarh: Union Home Minister Amit Shah says, "Now the time has gone when bullets were fired and bombs exploded here. I have come to request all those people who have weapons in their hands, all the Naxalite brothers, to give up their weapons. No one is… pic.twitter.com/A2j2oOC7El
— ANI (@ANI) April 5, 2025
Also Read: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం.. రంగంలోకి ట్రంప్ మామ- బ్యాన్ చేయాలంటూ!
ఇదిలాఉండగా తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 86 మంది మావోలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ నేతల ప్రొటెక్షన్ కమాండర్లు ఉన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఈ మేరకు ఇవాళ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 86 మంది మావోయిస్టులు పోలీస్ బెటాలియన్ కార్యాలయంలో ఐజీ (IG) ఎదుట సరెండర్ అయ్యారు. వారంతా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ దళ సభ్యులని పోలీసులు వెల్లడించారు. లోంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.
Also Read: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ
Also Read: ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!
telugu-news | rtv-news | chattisgarh | maoist