Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

మధ్యప్రదేశ్‌లో ఓ ఫేక్ డాక్టర్ బాగోతం బయటపడింది. నరేంద్ర విక్రమాదిత్య బ్రిటన్‌లో ఫేమస్ డాక్టర్ పేరు చెప్పుకొని ఓ మిషనరీ హాస్పిటల్‌లో చేరాడు. అక్కడ అనేక మందికి సర్జరీలు కూడా చేశాడు. వారిలో ఏడుగురు చనిపోయారు.

New Update
fack doctor

fack doctor Photograph: (fack doctor)

మధ్యప్రదేశ్ దామోహ్‌లో ఓ డాక్టర్ ఏడుగురిని ప్రాణాలను బలిగొన్నాడు. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఫేమస్ కార్డియాలజిస్ట్ అని చెప్పుకుంటూ.. ఎన్. జాన్ కెమ్ ఆయన పేరని చెప్పుకున్నాడు. వాస్తవానికి అతని అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్. గొప్ప కార్డియాలజిస్ట్ డాక్టర్ అని చెప్పుకొని ప్రైవేట్ మిషనరీ హాస్పిటల్‌లో చేరాడు. ఈ తరహాలోనే కొందమంది రోగులకు హార్ట్ సర్జరీలు చేయగా.. అందులో ఏడుగురు పేషెంట్లు చనిపోయారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

ఈ ఫేక్ డాక్టర్ బాధిత రోగుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నరేంద్ర విక్రమాదిత్యని పోలీసులు అరెస్ట్ చేసి దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. అతని మెడికల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ గురించి ఆరాతీస్తున్నారు. మానవ హక్కుల సంఘాలు, న్యాయవాది ఈ విషయంపై మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు.

జిల్లా దర్యాప్తు బృందం ఆసుపత్రి నుండి అన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో ఆ నకిలీ వ్యక్తి ప్రముఖ బ్రిటిష్ వైద్యుడి మాదిరిగానే నకిలీ పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడైంది. నిందితుడు హైదరాబాద్‌లో నమోదైన క్రిమినల్ కేసుతో సహా అనేక వివాదాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also read: Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

Advertisment
తాజా కథనాలు