Amit Shah: ఒక్కసారి మోదీకి అవకాశం ఇవ్వండి.. అది చేసి చూపిస్తాం: అమిత్ షా

ఢిల్లీలో ఆప్ వ్యతిరేక వేవ్ నడుస్తోందని.. ప్రజలు చీపురుతో ఊడ్చేసి తరముతారంటూ అమిత్ షా అన్నారు. ఈసారి మోదీకి ఒక అవకాశం ఇవ్వండని.. ఐదేళ్లలో ప్రపంచంలోనే ఉత్తమ రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Amit Shah

Amit Shah

ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆప్ వ్యతిరేక వేవ్ నడుస్తోందని.. ప్రజలు చీపురుతో ఊడ్చేసి తరముతారంటూ పేర్కొన్నారు. శనివారం ముస్తాఫాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. '' ఆమ్ ఆద్మీ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ పాలన నుంచి, మద్యం మాఫియా నుంచి విముక్తి పొందాల్సిన సమయం వచ్చింది. 

Also Read: బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట.. ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా ?

Amit Shah - PM Modi

నిజాయతీ లేని వ్యక్తులను తరిమికొట్టాల్సిన సమయం ఇది. ఈసారి మోదీ (PM Modi) కి ఒక అవకాశం ఇవ్వండి. ఈ ఐదేళ్లలో ప్రపంచంలోనే ఉత్తమ రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతాం. ఢిల్లీలో మోసపూరిత, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించే, అవినీతీ ప్రభుత్వం(3G) నడుస్తోంది. యమునా నదిలో నీటిని హర్యానా ప్రభుత్వం విషతుల్యం చేసినట్లు కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్.. హర్యాణా ప్రభుత్వం విషం కలపలేదు. మీరే కాలుష్యాన్ని వ్యాప్తి చేసి నదిని విషతుల్యం చేశారు.  

Also Read :  సహనం కోల్పోయిన పూజా హెగ్డే.. ఇంటర్వ్యూయర్‌ అడిగిన ప్రశ్నకు ఏం చేసిందంటే?

యమునా నదిని శుభ్రం చేస్తామని.. ఛట్‌ పూజను ఘనంగా నిర్వహిస్తామని, యమునా నదిలో స్నానం చేస్తానని గతంలో మాటలు చెప్పారు. కానీ అవి ఇప్పటికీ జరగలేదు. ఢిల్లీ ప్రజల డబ్బుతో కోట్లు విలువ చేసే ఇల్లు కట్టుకోవడం కాదు. ఆప్ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడింది. ఢిల్లీని డంపింగ్ యార్డ్‌లా మార్చారు. వర్షాలు వస్తే ఢిల్లీ మురికినీటి సరస్సుగా మారుతుంది. దీనివల్ల వ్యాధులు వస్తున్నాయని'' అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు.  

Also Read: బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు!

ఇదిలాఉండగా.. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఈసారి ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.    

Also Read :  బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు!

Advertisment
తాజా కథనాలు