Amit Shah: ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వస్తే ఝార్ఖండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని తరిమికొడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు. By B Aravind 03 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో బీజీ అయిపోయాయి. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని తరిమికొడతామన్నారు. సోరెన్ ప్రభుత్వ పాలనలో అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోతోందని దీనివల్ల సంతాల్ పరగణాలో గిరిజన తగ్గిపోతుందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఝార్ఖండ్‌లో అక్రమ వలసదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చట్టం తీసుకొస్తుందని తెలిపారు. Also read: యూపీ సీఎంకు బెదిరింపులు.. సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొస్తాం చొరబాటుదారులు రాష్ట్రానికి వచ్చి ఇక్కడి ఆడబిడ్డలను ప్రలోభపెట్టి పెళ్లిళ్లు చేసుకొని భూములను ఆక్రమించుకుంటున్నారని అమిత్ షా మండిపడ్డారు. దీన్ని నియంత్రించకపోతే రాష్ట్ర సంస్కృతికి, ఉపాధికి, ఆడబిడ్డలకు భద్రత ఉండదన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) ప్రవేశపెడతామని పేర్కొన్నారు. గిరిజనులను దీనికి దూరంగా ఉంచుతామని తెలిపారు. రాంచీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. 'సంకల్ప్ పత్ర' పేరుతో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. Also Read: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి! రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగవకాశాలు, మహిళలకు ప్రతీ నెల రూ.2100, ఉమ్మడి పౌరస్మృతి అమలు లాంటి హామీలను మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇదిలాఉండగా.. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటమిలకు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత హేమంత్ సోరెన్ నేతృత్వంలో ఇండియా కూటమితో పాటు జైరాం మహతో ఏర్పాటుచేసిన కూటమి బీజేపీకి సవాలు విసురుతోంది. మరోవైపు హిందుత్వ, జేఎంఎం నేతల అవినీతి అంశాలు ఇండియా కూటమికి సవాలుగా మారాయి. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానలున్నాయి. నవంబర్ 13, 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 23న ఫలితాలు విడుదల కానున్నాయి. Also Read: ఎటు వెళ్తోందీ సమాజం.. ఇది ఎంత వరకు సమంజసం!? సజ్జనార్ ఫైర్! Also Read : హరీష్ శంకర్ కు పవన్ ఆర్డర్స్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' స్క్రిప్ట్‌లో మార్పులు? #telugu-news #national-news #jharkhand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి