ఎటు వెళ్తోందీ సమాజం.. ఇది ఎంత వరకు సమంజసం!? సజ్జనార్ ఫైర్! హైటెక్‌సిటీలో బైక్‌లపై విన్యాసాలు చేస్తూ బాణసంచా కాల్చిన ఆకతాయిలపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం' అంటూ ఆ వీడియోలను పోస్ట్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. By srinivas 03 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Sajjanar: దీపావళి పండగ సందర్భంగా కొందరు యువకులు చేసిన పనిపై టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైటెక్‌సిటీలో కొందరు ఆకతాయిలు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ బాణసంచా కాలుస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పండగపూట ఇదేం వికృతానందమంటూ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఈ వీడియోలను నెట్టింట పోస్ట్ చేశారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR — V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 ఎటు వెళ్తోందీ సమాజం.. ‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?' అంటూ సజ్జనార్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. #hyderabad #diwali #md-sajjanar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి