Train Accident: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి! కేరళలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలపై వేగంగా వస్తున్న రైలు ఢీకొని నలుగురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. అందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు By Bhavana 03 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kerala: కేరళలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శనివారం షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ప్రమాదం నలుగురు రైల్వే పారిశుద్ధ్య సిబ్బంది మృతి చెందారు. ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళ ఎక్స్ప్రెస్ ...ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. షోరనూర్ రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిడ్జి దగ్గరలో.. రైల్వే ట్రాక్‌పై ఉన్న చెత్తను తొలగించే పనిలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. Also Read: అందంగా ఉన్నావ్ వస్తావా! మహిళలకు మంత్రి ఉత్తమ్ పీఏ సెక్స్ వల్ టార్చర్ అదే సమయంలో కేరళ ఎక్స్‌ప్రెస్ దూసుకురావడంతో అక్కడికక్కడే వారు చనిపోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరు మహిళలు తమిళనాడుకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు ఎక్కడి వారు అనేది ఇంకా తెలియలేదని రైల్వే పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం 3.05 గంటల సమయంలో కార్మికులను రైలు ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. Also Read: కేదర్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు మూసివేత రైలును గమనించకపోవడం వల్లే.. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అధికారులు.. హుటాహుటిన సంఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అయితే ఎక్స్‌ప్రెస్ రైలును పారిశుద్ధ్య కార్మికులు గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని.. రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం అదే అని ప్రాథమికంగా తేల్చారు. అయితే ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని షోరనూర్ రైల్వే పోలీస్ అధికారి చెప్పారు. Also Read: కులగణన సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన ఇక మొత్తం నలుగురిని రైలు ఢీకొనగా.. అందులో ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు మాత్రమే దొరికాయి. నాలుగో వ్యక్తి మృతదేహం అక్కడే ఉన్న భరతపుజ నదిలో పడిపోగా.. దాన్ని వెలికితీసేందుకు రైల్వే సిబ్బంది గాలింపు చర్యలు మొదలు పెట్టారు. Also Read: గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడి..దాదాపు వంద మంది మృతి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి