CM Yogi: యూపీ సీఎంకు బెదిరింపులు.. సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ని హత్య చేస్తామని ముంబాయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. పది రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని లేకపోతే బాబా సిద్ధిఖీలానే హత్య చేస్తామని దుండగులు మెసేజ్ చేశారు. By Kusuma 03 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను చంపేస్తామంటూ ముంబాయి పోలీసులకు బెదిరింపులు వచ్చాయి. ఇటీవల బాబా సిద్ధిఖీకి ఎలాంటి బెదిరింపులు రాకుండా హ్యతకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌ని కూడా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు యూపీ సీఎంకి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! సిద్ధిఖీలానే యూపీ సీఎంను చంపుతామంటూ.. బాబా సిద్ధిఖీలా యూపీ సీఎంని కూడా చంపుతామని ముంబాయి పోలీసులకు కొందరు దుండగులు బెదిరింపు సందేశాలు పంపించారు. పది రోజుల్లో వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే హత్య చేస్తామని ముంబాయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని దుండగులు మెసేజ్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు! ఇదిలా ఉంటే ఇటీవల సిద్ధిఖీ కుమారుడు జీషన్‌కి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. తనని కూడా హత్య చేస్తామని కొందరు దుండగులు బెదిరింపు మెయిల్స్ చేశారు. అయితే జీషన్ తండ్రి అయిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. బాంద్రాలోని జీషన్ కార్యాలయం దగ్గర సిద్ధిఖీ ఉన్నప్పుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు సిద్ధిఖీని మూడు రౌండ్లు తుపాకీలతో కాల్చడంతో మరణించారు. అయితే ఈ హత్య లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేసినట్లు కూడా ఒప్పుకుంది. సల్మాన్ ఖాన్‌తో సిద్దిఖీ సన్నిహితంగా ఉండటం వల్ల హత్యకు గురైనట్లు సమాచారం. అయితే సిద్దిఖీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదు. అయిన కూడా హత్యకు గురయ్యారు. ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం #uttar-pradesh #baba-siddiqui #cm-yogi-adityanath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి