Pawan Kalyan: హరీష్ శంకర్ కు పవన్ ఆర్డర్స్.. 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌' స్క్రిప్ట్‌లో మార్పులు?

'ఉస్తాద్ భగత్ సింగ్' స్క్రిప్ట్‌కి సంబంధించి మార్పులు చేస్తున్న‌ట్లు న్యూస్ బయటికొచ్చింది. కొన్నిరోజుల కింద హరీష్‌ను పిలిపించిన పవన్.. స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించారట. అంతేకాదు డైలాగ్స్‌కు వెర్షన్​ను కూడా మార్చమని పవన్ కోరినట్లు తెలుస్తోంది.

New Update
ustaad

హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కొంతవరకు షూటింగ్ జరుపుకోగా.. ఇటీవల ఏపీ ఎలక్షన్స్ వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. 

Also Read :  ఆమె జాగ్రత్త.. ఇదే నా లాస్ట్‌ వీకెండ్‌: రష్మిక పోస్ట్ వైరల్!

ఈ క్ర‌మంలోనే ఈ మూవీ సంబంధించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్‌కి సంబంధించి మార్పులు చేస్తున్న‌ట్లు న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమాకు సంబంధించి మార్పులు చేయ‌మ‌ని హరీశ్‌ను ప‌వ‌న్ కోర‌గా.. హరీశ్ ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తుంది.

Also Read :  ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Also Read : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్..?

డైలాగ్స్ వెర్షన్ కూడా..

కొన్ని రోజుల క్రితం హ‌రీశ్ శంక‌ర్ ప‌వ‌న్‌ను కలవగా.. ఈ మార్పులు గురించి చర్చ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో డైలాగ్స్‌కు సంబంధించి కూడా వాటి వెర్షన్​ను మార్చమని పవన్ కోరారని, అందుకు తగ్గట్లు హరీశ్ స్క్రిప్ట్ రీవర్క్ చేస్తున్నారని సమాచారం. 

అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్' తో కమర్షియల్ గా బిగ్ సక్సెస్ అందుకున్న హరీష్ శంకర్.. ఈసారి 'ఉస్తాద్ భగత్ సింగ్' తో అదిరిపోయే సోషల్ మెసేజ్ ఇవ్వనున్నారట. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : 'పుష్ప2' ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ ఫైనల్.. బన్నీతో స్టెప్పులేసేది ఎవరంటే?

Advertisment
తాజా కథనాలు