/rtv/media/media_files/2025/01/18/oRdpbLHpu4sUaOZxIDj1.jpg)
manoj, vishnu
Manchu Manoj: మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వీరి వ్యక్తిగత వివాదం.. ఇప్పుడు సినిమాల వరకు వెళ్ళింది. తాజాగా మంచు మనోజ్ 'కన్నప్ప' సినిమాను ఉద్దేశిస్తూ చేసిన సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ది లెంజెండ్ ఆఫ్ #దొంగప్ప జూన్ 27న విడుదల కానుంది. ఇంతకీ జూలై 17న, లేదా జూన్ 27న?100 కోట్లు ప్లస్ బడ్జెట్ (ఇందులో 80% #ViSmith కమీషన్) ప్లానింగ్ కేక అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు మనోజ్.
Mark your calendars! 📅 The legend of #Dongappa hits the big screen on 27th June! 🎥
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 10, 2025
Inthaki release jul 17th aa, Ledha June 27th . 100 crore plus (80% #ViSmith commission) budget movie pr planning keka. pic.twitter.com/Oi7qaNmsj6
బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ
ఇప్పటివరకూ వ్యక్తిగతంగా సాగిన అన్నదమ్ములు వివాదం.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడే వరకు వచ్చింది. ముందుగా విష్ణు 'కన్నప్ప' మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయగా.. అదే రోజున మనోజ్ 'భైరవం' మూవీ కూడా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో విష్ణు వెనక్కి తగ్గారు. కన్నప్ప రిలీజ్ పోస్ట్ ఫోన్ చేస్తూ.. జూన్ 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఇటీవలే జరిగిన వివాదం నేపథ్యంలో మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'కన్నప్ప' కు పోటీగా 'భైరవం' విడుదల చేద్దామని అనుకున్నాం. దాంతో టెన్షన్ పడిపోయి తన సినిమా వాయిదా వేసుకున్నాడు. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక తన అనుచరుల చేత నా కారు, వస్తువులను దొంగలించి, నా ఇంట్లో విధ్వంశం సృష్టించాడని విష్ణు పై సంచలన ఆరోపణలు చేశారు.
telugu-news | latest-news | cinema-news | manchu manoj and manchu vishnu fight
Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!