HYD: ఇన్నాళ్ళూ లీజ్, ఇప్పుడు ఓనర్..లులూ యాజమాన్యం చేతికి మంజీరా మాల్

దివాలా తీసిని మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ ను లులూ ఇంటర్నేషనల్ షాపింగ్స్ మాల్స్ సొంతం చేసుకుంది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ నిర్వహించిన దివాలా ప్రక్రియలో రూ.318.42 కోట్లకు దీన్ని కొనేసుకుంది. 

New Update
ap

Lulu Mall

హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న మంజీరా మాల్ యాజమాన్య సంస్థ అయిన మంజీరా రిటెయిల్‌ హోల్డింగ్స్‌ చాలా రోజులుగ దివాలా తీసే పరిస్థితిలో ఉంది. మంజీరా రిటెయిల్‌ హోల్డింగ్స్‌ తమవద్ద తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో కేటలిస్ట్‌ ట్రస్టీషిప్‌ గత ఏడాది జులైలో ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దీంతో ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయింింది. దాని కోసం బీరేంద్ర కుమార్ అగర్వాల్ ను రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌గా నియమించింది. 

మంజీరా మాల్స్ ఇప్పుడు లులూ చేతిలో..

ఎన్సీఎల్టీ మంజీరా మాల్స్ దివాలా ప్రక్రియలో భాగంగా బిడ్లను పిలిచింది. దాని తర్వాత చేయాల్సివన్నీ కూడా చేసింది. ఈ దశలన్నింటినీ దాటుకుని లులూ ఇంటర్నేషనల్‌ షాపింగ్‌ మాల్స్, మంజీరా రిటెయిల్‌ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది. రూ.318.42 కోట్లకు మొత్తం అన్ని బిల్డింగ్ లనూ కొనేసుకుంది.  కేటలిస్ట్‌ ట్రస్టీషిప్‌ లిమిటెడ్, ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీఓసీలో ఉన్నాయి. దీంతో ఇంత కాలం లీజ్ తీసుకున్న మంజీరా మాల్ కు ఇప్పుడు లులూ యజమానిగా మారిపోయింది. 

 today-latest-news-in-telugu | hyderabad | lulu-mall 

Also Read: USA: హమ్మ ట్రంప్ మామూలోడివి కాదు..ఇన్ సైడర్ ట్రేడింగ్ తో వివాదం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు