Mathura: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. సర్వేకు బ్రేక్ ఇచ్చిన ధర్మాసనం
యూపీలోని మథురలో శ్రీకృష్ణ జన్మవివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ ఆలయం వద్ద ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేస్తూ తీర్పు వెలువరించింది. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించాలంటూ హిందూ సంఘాలను ఆదేశించింది.