/rtv/media/media_files/2025/09/05/akshy-kumar-2025-09-05-20-22-20.jpg)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన పంజాబ్ వరద(Punjab flood) బాధితుల కోసం ఆయన రూ. 5కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. దీనిని ప్రజాసేవగా భావిస్తున్నాని, విరాళం అనుకొనని ఆయన తెలిపారు. వరద బాధితులకు సహాయం చేసే అవకాశం లభించినందుకు తాను అదృష్టవంతుడిగా భావిస్తున్నానని, ఇది కేవలం సేవ మాత్రమే అని ఆయన తెలిపారు. పంజాబ్‌లోని నా సోదరులు, సోదరీమణులను తాకిన ప్రకృతి వైపరీత్యం త్వరగా పోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఇలాంటి సంక్షోభాల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి అక్షయ్ కుమార్ ముందుకు రావడం ఇదేం మొదటిసారి కాదు.
Akshay Kumar donated ₹5 crore for flood relief in Punjab, aiding efforts to support those affected by the severe floods.#buzzzookascrolls#akshaykumar#punjabfloodspic.twitter.com/wLml6hoCmD
— Buzzzooka Scrolls (@Buzzz_scrolls) September 5, 2025
అక్షయ్ కుమార్ భారీ విరాళాలు
అక్షయ్ కుమార్(Akshay Kumar) గతంలో కూడా పలు విపత్తుల సమయంలో భారీ విరాళాలు ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. చెన్నై వరదలు, కోవిడ్-19 మహమ్మారి వంటి సందర్భాలలో ఆయన చేసిన సహాయం ప్రశంసలు పొందింది. అంతేకాకుండా, సైనికుల కుటుంబాలకు సహాయం అందించేందుకు ఆయన భారత్ కే వీర్ అనే కార్యక్రమాన్ని కూడా స్థాపించారు. పంజాబ్ వరద బాధిత ప్రజలకు అక్షయ్ కుమార్ అందించిన ఈ సహాయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఆయనతో పాటు సోనూ సూద్, దిల్జిత్ దోసాంజ్, అమీ విర్క్, కపిల్ శర్మ వంటి అనేక మంది ఇతర ప్రముఖులు కూడా వరద బాధితులకు తమ వంతు సహాయం అందిస్తున్నారు.
పంజాబ్‌లో భారీ వర్షాలు(Heavy Rains), నదుల పొంగిపొర్లడం వల్ల భీకరమైన వరదలు సంభవించాయి. ఇది గత నాలుగు దశాబ్దాలలో రాష్ట్రం చూసిన అత్యంత తీవ్రమైన వరదలలో ఒకటి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. పంజాబ్‌లోని మొత్తం 23 జిల్లాల్లో 1,655 కంటే ఎక్కువ గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఈ వరదల కారణంగా 3.5 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. ఇప్పటివరకు, 37 మందికి పైగా ప్రజలు వరదల వల్ల ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.75 లక్షల హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమి నీట మునిగిపోయింది. దీంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. గోధుమ, వరి వంటి ప్రధాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Also Read : Viral video: నీకు ఎంత ధైర్యం?.. IASకు డిప్యూటీ సీఎం బెదిరింపులు.. వీడియో వైరల్!