Viral video: నీకు ఎంత ధైర్యం?.. IASకు డిప్యూటీ సీఎం బెదిరింపులు.. వీడియో వైరల్!

మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టిన ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

New Update
IPS Officer

మహిళా IPS ఆఫీసర్‌తో ఉపముఖ్యమంత్రి ఫోన్ కాల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్రమ ఇసుక రవాణా దందాతో సంబంధం ఉన్న ఉపముఖ్యమంత్రి ఐపీఎస్ ఆఫీసర్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టిన ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోలాపూర్ జిల్లాలోని కుర్దూ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై DSP అంజనా కృష్ణ తన సిబ్బందితో కలిసి తనిఖీలకు వెళ్లారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని ఆమె అడ్డుకున్నారు. ఈ క్రమంలో, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. వారిలో ఒకరు నేరుగా అజిత్ పవార్‌కి ఫోన్ చేసి, ఈ విషయం గురించి చెప్పారు. అజిత్ పవార్ ఫోన్‌ ఐపీఎస్ ఆఫీసర్‌కు ఇవ్వమని చెప్పారు. ఫోన్‌లో మాట్లాడిన అజిత్ పవార్, "నేను డిప్యూటీ సీఎంని మాట్లాడుతున్నాను, ఆ ఇసుక వాహనాలను వెంటనే ఆపండని ఆదేశించారు. అయితే, అజిత్ పవార్ వాయిస్‌ను గుర్తుపట్టని అంజనా కృష్ణ, "మీరు నిజంగా డిప్యూటీ సీఎం అయితే, నా నంబర్‌కు వీడియో కాల్ చేయగలరా?" అని అన్నారు. ఈ మాటలకు అజిత్ పవార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. "నీకు ఎంత ధైర్యం? నన్నే వీడియో కాల్ చేయమంటావా? నేను నీపై యాక్షన్ తీసుకుంటాను" అంటూ ఆమెపై మండిపడ్డారు. అయినప్పటికీ ఆమె మొండిగా, వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఈ మొత్తం సంభాషణ అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో అజిత్ పవార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు కూడా చట్టాలకు లోబడే ఉండాలని, ఐపీఎస్ ఆఫీసర్ డ్యూటీని అడ్డుకోవడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై ఎన్సీపీ నేత సునీల్ తట్కరే స్పందించారు. అజిత్ పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి అలా మాట్లాడి ఉండవచ్చని వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.

Advertisment
తాజా కథనాలు