/rtv/media/media_files/2026/01/18/maoist-2026-01-18-19-33-57.jpg)
Maoist
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జి సున్నం చంద్రయ్య ఎలియాస్ పాపారావు, నేషనల్ పార్క్ ఏరియా కమిటీ చీఫ్ దిలీప్ బెడ్జా ఆ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది.
Also Read: బెంగాల్‌లో అధికారంలోకి వస్తే వాళ్లని తరిమికొడతాం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
దీంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ చీఫ్ దిలీప్ బెడ్జా సహా నలుగురు మావోయిస్టులు చనిపోయారు. వీళ్లలో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. ఆదివారం కూడా అదే ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలం నుంచి AK 47, 303 రైఫిల్‌తో పాటు భారీగా పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Also Read: కొత్త నాయకత్వం రావాలి..ఖమేనీని వెళ్లగొట్టాలని పిలుపిచ్చిన ట్రంప్
Follow Us