BREAKING: నడి రోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త

తమిళనాడులో కార్పోరేటర్‌ గోమతిని తన భర్త నడి రోడ్డుపై నరికి దారుణంగా చంపాడు. గోమతికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో చంపేసి, వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాడు.

New Update
Tamilnadu murder

Tamilnadu murder

తమిళనాడులో వివాహేతర సంబంధం వల్ల ఓ భర్త భార్యను హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరునింద్రవూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎస్ గోమతి కౌన్సిలర్‌గా పని చేస్తుంది. పదేళ్ల కిందట ఈ జంటకు పెళ్లి కాగా వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే గోమతికి వేరే వ్యక్తితో రిలేషన్ ఉందని అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు తరచుగా గొడవలు జరిగేవి.

ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు

ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?

అనుమానంతోనే..

గోమతి తాజాగా ఓ అబ్బాయిని కలిసినట్లు భర్తకు తెలిసింది. దీంతో గోమతి భార్య స్టీఫెన్ రాజ్ ఆమెతో గొడవపడ్డాడు. ఈ వివాదం కాస్త ముదరడంతో భర్త స్టీఫెన్ ఆమెను నడి రోడ్డుపై కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై తిరువళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోమతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు

Advertisment
Advertisment
తాజా కథనాలు