/rtv/media/media_files/2025/10/11/artificial-intelligence-ai-2025-10-11-07-30-29.jpg)
Artificial Intelligence (AI)
AI Lessons: ప్రస్తుతం అన్నిరంగాల్లో కృత్రిమ మేధ (Artificial Intelligence) తప్పనిసరి అయిన తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2026-27) విద్యాసంవత్సరంలో మూడో తరగతి నుంచే పాఠ్యాంశాల్లో విద్యార్థులకు ఏఐని చేర్చాలని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ సందర్భంగా అన్ని తరగతుల విద్యార్థుల కోసం ఒక ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్ వర్క్‌ను కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Also Read : మోహన్‌బాబుకు బిగ్ షాక్... విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా
‘‘ఏఐకి సంబంధించి వచ్చే రెండు మూడేళ్లలో విద్యార్థులు, టీచర్లు సమన్వయం చేసుకునేలా మేము వేగంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర వివరించింది. దేశవ్యాప్తంగా సుమారు కోటి మంది టీచర్లకు ఏఐ టెక్నాలజీ విద్యపై దిశానిర్దేశం చేయడంలో కొంత సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. అన్ని తరగతులకు సంబంధించి ఏఐ ఇంటిగ్రేషన్ చేయడానికి సీబీఎస్‌ఈ ఒక ప్రేమ్ వర్క్‌ను అభివృద్ధి చేస్తోందని’’ కేంద్ర స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంజయ్ కుమార్ వివరించారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాల ప్రణాళికను రూపొందించడానికి, ఏఐ టూల్స్ ఉపయోగించడానికి ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 18,000 సీబీఎస్‌ఈ పాఠశాలలు ఆరో తరగతి నుంచి ఏఐని బోధిస్తున్నాయని తెలిపారు. ప్రాథమికంగా ఏఐని అర్థం చేసుకోవడానికి 15 గంటల మాడ్యూల్‌తో ఈ బోధన సాగుతోంది. ఇక 9 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులకు ఇది ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఉందని వివరించారు.
Also Read : నన్ను ఓడగొట్టారు... అంజన్‌కుమార్ సంచలన కామెంట్స్
నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలు హుష్ కాకి
ఐటీ, బీపీవో రంగాల్లో కృతిమ మేధ (ఏఐ) సాంకేతికతలను అందిపుచ్చుకోవలసిన అవసరం ఉందని, ఒక వేళ నిర్లక్ష్యం వహిస్తే 2031 నాటికి దేశంలో కనీసం 20లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. అదే సమయంలో ఏఐకి అనుగుణంగా మానవ వనరుల నైపుణ్యాలకు పదనుపెట్టుకుంటే మాత్రం 40 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించింది. ‘రోడ్ మ్యాప్ ఫర్ జాబ్ క్రియేషన్ ఇన్ ద ఏఐ ఎకానమి’ పేరుతో నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఒక నివేదిక విడుదల చేశారు. ‘కృత్రిమ మేధ ఏ రూపంలో వచ్చినా దాని కారణంగా చాలా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. అయితే ఏఐని ఉపయోగించుకుంటే ఉద్యోగాలు కోల్పోకుండా కొత్త స్థానాల్లోకి మారేందుకు అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది’ అని ఆ నివేదిక వివరించింది.
ఇది కూడా చదవండి:దీపావళికి ఫిట్‌గా కనిపించాలంటే... తక్కువ రోజుల్లో 2-4 కేజీల బరువుని ఇలా తగ్గించుకోండి!!
Follow Us