HYDRA: అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం.. అక్కడ భారీ కూల్చివేతలు!

అక్రమార్కులపై హైడ్రా మరోసారి ఉక్కుపాదం మోపింది. పలు అక్రమ నిర్మాణాలను నేల మట్టం చేసింది. శంషాబాద్ లో పార్కు, రోడ్డు, ఇతర ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు.

New Update
HYDRA Action

HYDRA Action in shamshabad

శంషాబాద్ లో హైడ్రా యాక్షన్ మొదలు పెట్టింది. పలు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. సదరన్ ప్యారడైజ్ (శ్రీ సంపత్ నగర్)లో 998 గజాల పార్కు ను కబ్జా చేశారంటూ ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు అందింది. శంషాబాద్ మండలంలోని ఊట్పల్లి గ్రామం కెప్టౌన్- 2 కాలనీలో 33 అడుగుల రహదారి ఆక్రమించి ప్రహరీ నిర్మించినట్లు మరో ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో కబ్జా జరిగింది నిజమేనని తేలింది. దీంతో హైడ్రా సోమవారం రంగంలోకి దిగింది. ఆయా నిర్మాణాలను నేలమట్టం చేసింది. పార్కు చుట్టూ ఫెన్సింగ్ తో పాటు రేకుల షెడ్డు ను తొలగించింది. రహదారి ఆక్రమించి నిర్మించిన ప్రహరీని సైతం కూల్చివేసింది. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణలు చేపడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని హైడ్రా అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు